కంట్రోల్ చేసుకోమన్న రేణు దేశాయ్..!

0
426
Renu Desai Post Special Video On Diwali Crackers

Renu Desai special request: పవన్ కళ్యాణ్ మాజీ భార్య, మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్ అనే సంగతి మనందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూనే సమాజంలోని అంశాలపై స్పందించడం రేణు నైజం. అయితే.. రోటీన్ కు భిన్నంగా కొందరు పెడుతున్న పోస్టులు బాగా పాపులర్ కావటమే కాదు.. వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అందరికీ పండగ శుభాకాంక్షలు చెబుతూ వీడియో పోస్ట్ చేశారు రేణు దేశాయ్.

”అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు. అందరూ సురక్షితంగా, సంతోషంగా ఈ పండగను జరుపుకోండి. బాగా ఎంజాయ్ చేయండి. క్రాకర్స్ మొత్తానికే కాల్చొద్దని నేను చెప్పను కానీ.. ఎంతవరకు కుదిరితే అంతవరకు క్రాకర్స్ కాల్చడం తగ్గించండి. అది మానడం కష్టమే. ఎందుకంటే మన సంప్రదాయం ప్రకారం దీపావళి రోజున క్రాకర్స్ కాల్చడం, దీపాల వెలుగులో ఆనందంగా గడపడం అనేది ఎప్పటినుంచో వస్తోంది. కాకపోతే కాకర్స్ విషయంలో కంట్రోల్‌లో ఉంటే బెటర్. శబ్ద కాలుష్యం, వాతావరణ కాలుష్యాన్ని కొంతైనా తగ్గించండి” అని పేర్కొన్నారు రేణు దేశాయ్.

తన సందేశాన్ని అచ్చ తెలుగులో చెప్పిన రేణు.. తన క్యూట్ మెసేజ్ తో ఎవరిని మనసుల్ని నొప్పించకుండా మెప్పించారని చెప్పక తప్పదు. హీరోయిన్‌గా, రచయితగా టాలెంట్ ప్రూవ్ చేసుకున్న రేణు దేశాయ్ ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. తన కూతురు ‘ఆద్య’ పేరుతో ఓ పవర్‌ఫుల్ లేడి ఓరియంటెడ్ ప్యాన్ ఇండియా వెబ్ సిరీస్‌కి శ్రీకారం చుట్టారు.

Previous articleఆర్ఆర్ఆర్ టీజర్ పాతరికార్డులన్నీ చెరిపేసిన తారక్..!
Next articleముచ్చటగా మూడోసారి సుధీర్ బాబు..!