Ravi Teja – Renu Desai : రవితేజ చేస్తున్న సినిమాల్లో టైగర్ నాగేశ్వరరావు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వంశీ కృష్ణ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ బద్రి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రేణూ దేశాయ్, రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా లో సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేస్తున్నారు రేణూ దేశాయ్. రేణూ దేశాయ్ పెళ్లయిన తర్వాత నటనపై ఇంట్రెస్టు లేకపోవడంతో కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నారు.
దాదాపు 18 ఏళ్ల విరామం తర్వాత రేణూ దేశాయ్ ఈ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తోంది. ఇందులో రేణూ దేశాయ్ ఏ పాత్రలో నటిస్తుందనే విషయంలో అనేక రూమర్స్ ఉన్నాయి. అయితే ఈ రూమర్స్ అన్నిటినీ కట్టి పెడుతూ తాజాగా రేణూ దేశాయ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీతో ఈ సినిమాలో తన గురించి స్పష్టత ఇచ్చింది.
రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ హలో నాగేశ్వరరావు స్క్రిప్టు సంబంధించిన బుక్కు ని చూపిస్తూ పాత్ర గురించి ఇలా చెప్పుకొచ్చింది. “హేమలత లవణం గారి వంటి స్ఫూర్తిదాయకమైన పాత్రలో నేను బాగుంటాను అని నన్ను నమ్మినందుకు డైరెక్టర్ వంశీకృష్ణకు కృతజ్ఞతలు”.
1988లో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జోగినీ వ్యవస్థ నిర్మూలన చట్టం వెనుక ఈమె కృషి ఎంతో ఉంది. 2007లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం హేమలత కు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ఇలాంటి పాత్రలు చేస్తున్నందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.