Renu Desai completes Tiger Nageswara Rao shooting: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో. ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్ర నటిస్తుందని మేకర్స్ ఎనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఈ సినిమాతో పాటు ప్రస్తుతం ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. టైగర్ నాగేశ్వరావ్ గురించి రేణు దేశాయ్ లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చారు.
Renu Desai completes Tiger Nageswara Rao shooting: రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాకు సంబంధించిన షూటింగ్ లో రేణు దేశాయ్ వారాల క్రితం పాల్గొన్నారు. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు షూటింగ్ కంప్లీట్ అయినట్టు రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని పెట్టడం జరిగింది. రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో టైగర్ నాగేశ్వరావ్ టీమ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాకు వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించిన ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.
ఇక రవితేజ సినిమాలు విషయానికి వస్తే, ధమాకా అలాగే వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో రవితేజ మంచి ఊపు మీద ఉన్నారు. ఇప్పుడు రావణాసుర అలాగే టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో మళ్ళీ హిట్ కొట్టి అగ్ర హీరోలతో పోటీ పడాలని రవితేజ ఎదురుచూస్తున్నారు.