Return Of the Dragon Trailer: దక్షిణ భారత ప్రముఖ నిర్మాణ సంస్థ AGS ఎంటర్‌టైన్‌మెంట్ మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రదీప్ రంగనాథన్ – అశ్వత్ మరిముత్తు కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ లవ్ టుడే తర్వాత, ఈ జోడీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించనుంది.
ఈ చిత్రాన్ని AGS ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించగా, తెలుగులో మైత్రీ మూవీస్ విడుదల చేస్తోంది. ఫిబ్రవరి 21న ఈ సినిమా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది.
ట్రైలర్ హైలైట్ (Return Of the Dragon Trailer):
ట్రైలర్‌లో యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్రేమ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ వంటి అన్ని అంశాలను సమపాళ్లలో చూపించారు. 48 బ్యాక్‌లాగ్‌లతో కాలేజీ లైఫ్‌ను ఎంజాయ్ చేసే ఓ యువకుడి ప్రయాణం, అతని జీవితంలో వచ్చే మలుపులు, బాధ్యతలు, బ్రేకప్, లైఫ్ సెటిల్‌మెంట్ వంటి అంశాలను ఆసక్తికరంగా ప్రదర్శించారు.
తారాగణం మరియు సాంకేతిక బృందం:
కె.యస్. రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ, ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచగా, తాజా ట్రైలర్ మరింత బజ్‌ను క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముంది.