RGV comments on Pawan Kalyan Remuneration: రామ్ గోపాల్ వర్మ అనే పేరు కేవలం పేరు మాత్రమే కాదు అదొక బ్రాండ్. ఆర్జీవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సంచలనాలకి మారుపేరు.. అలాగే ఆర్జీవి సినిమా పొలిటికల్ అనే తేడా లేకుండా ఎవరి మీద అయినా సంచలమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇక మెగా ఫ్యామిలీ అంటే ఆర్జీవి మొదటి వరుసలో ఉంటారు. ఎప్పుడు ప్రస్తుతం ఆర్జీవీ వ్యూహం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఏపీ అభివృద్ధి గురించి అలాగే పరిపాలన గురించి చెబుతున్నట్టు తెలియజేశారు.
RGV comments on Pawan Kalyan Remuneration: దివంగత ప్రధాని వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత ఏపీ రాజకీయాల్లో జరిగిన పరిణామాలపై ఆయన సినిమా తీస్తున్నారు. అయితే ఈ సినిమాలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు చూపించబోతున్నట్టు సమాచారం. అయితే ఆర్జీవి ఎవరికి వ్యతిరేకం అనేది కాదు కానీ తను ప్రశ్నించే విధానంలో అందరికన్నా విభిన్నంగా ప్రశ్నిస్తారు. ఇప్పుడు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన మార్క్ వేసుకోవాలని చూస్తున్నారు.
ఆర్జీవికి వైయస్ రాజశేఖర్ రెడ్డి నుండి జగన్ వరకు తనకు చాలా అభిమానం అని చాలాసార్లు వెల్లడించారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తనకు అత్యంత ప్రియమైన నటుడు అని చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే విధంగా రీసెంట్గా ఇచ్చిన ఓ మీడియా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ వందకోట్ల రెమ్యూనరేషన్ గురించి సంచలనమైన కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ గురించి ఏపీ మంత్రులు రెమ్యూనరేషన్ అంత తీసుకుంటున్నారు అనే విషయాన్ని ప్రస్తావించగా ” ఎవరు ఏ సినిమాలో ఎంత పారితోషికం తీసుకుంటే నాకు అవసరం లేదు అంటూ ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు.” ఎప్పుడు మెగా ఫ్యామిలీకి నెగిటివ్ గా మాట్లాడే అర్జీవి ఒక్కసారిగా ఈ కామెంట్ చేయడంతో దీని వెనకాల ఏదో ఉంది అంటూ సోషల్ మీడియాలో ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. దానికి సంబంధించిన వీడియో కూడా ఒకసారి చూడండి.