RGV Kamma Rajyam Lo Kadapa Reddlu BABU CHAMPESTHADU song
RGV Kamma Rajyam Lo Kadapa Reddlu BABU CHAMPESTHADU song

రామ్ గోపాల్ వర్మ.. ఎవరేమి అన్నా.. ఏమని అనుకున్నా.. తాను అనుకున్నదే చేస్తాడు. ఎట్టి పరిస్థితిలో అయినా జరిగి తీరాల్సిందే. ఇదే ‘కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా విషయంలో జరిగింది. ఈ సినిమా సెన్సార్ కు సంబంధించి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. సినిమాకు ఎన్నో అభ్యంతరాలు ఎదురయ్యాయి. సినిమా పేరును కూడా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’గా పేరు మార్చాల్సి వచ్చింది వర్మకు..! ఊహించని విధంగా సినిమా మొత్తాన్ని చూసిన రివైజింగ్ కమిటీ కొన్ని కట్స్‌తో యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.

ఈ నెల 12న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వర్మ తెలిపారు. దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఇంకా బతికే ఉందని తెలిసి థ్రిల్ అయ్యాను అని ఆయన ట్వీట్ కూడా చేశారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సెన్సార్ లైన్ క్లియర్ కాగా.. డిసెంబర్ 12న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.సారీ సారీ.. అలవాటులో పొరపాటు ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయనున్నామని సెటైర్లు వేశాడు వర్మ.

తాజాగా ఓ వీడియో సాంగ్ ను విడుదల చేసిన వర్మ.. సినిమాపై అంచనాలను మరింత పెంచేశాడు. వీడియో సాంగ్ లోనే ఎన్నో సంచలన విషయాలను చూపించేశాడు వర్మ. ‘బాబు చంపేస్తాడు’ అని వర్మ పాడిన లిరికల్ సాంగ్ ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తాజాగా ఆ పాటకు సంబంధించి వీడియో సాంగ్ ను విడుదల చేశాడు వర్మ. సిరాశ్రీ రాసిన ఈ పాటను వర్మనే పాడడం విశేషం. ఓ పార్టీకి చెందిన బడా రాజకీయ నాయకుడు.. ఆయన పార్టీలో జరిగే ఎన్నో సంఘటనలు ఈ పాటలో చూపించేసాడు. అంతేకాకుండా లిరిక్స్ కూడా ఎంతో వివాదాస్పదంగా ఉన్నాయి. చెంప మీద కొడితే తట్టుకోగలడు.. కాళ్ల మధ్య తంతే నిలదొక్కుకోగలడు.. కానీ అహం మీద కొడితే చంపేస్తాడు.. బాబు చంపేస్తాడు.. అంటూ సాగే వీడియో సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఒక్క వీడియో సాంగ్ ద్వారానే ఇంత అరాచకం చేసిన వర్మ.. సినిమా మొత్తాన్ని చూసిన వాళ్లకు ఎంత కాంట్రవర్షియల్ పాయింట్స్ ఇస్తాడో చూడాలి. ఇక సోషల్ మీడియాలో వర్మ ప్రమోషన్స్ కూడా ఒక రేంజిలో ఉన్నాయి. ప్రతి ఒక్క సెలెబ్రిటీని వాడేసుకుంటున్నాడు వర్మ.