తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ రాంగోపాల్ వర్మ తెలియని తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ వ్యూహం పొలిటికల్ ఎంటర్టైనర్ సినిమాని తర్కెక్కిస్తున్నారు. ఈ సినిమా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కోణంలో సాగుతుంది అని ప్రచారంలో ఉంది. అయితే సినిమా విడుదలైన తర్వాత కానీ దీనిపైన క్లారిటీ రాదు.
రాంగోపాల్ వర్మ వ్యూహం పొలిటికల్ సినిమాని 2024 ఎన్నికల ముందు విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యూహం సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం విజయవాడలో శరవేగంగా జరుగుతుంది. ఈ సందర్భంగా ఔత్సాహిక కళాకారులకు ఆహ్వానం పలికారు RGV.
దీనిలో భాగంగానే నిన్న రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా పోస్టర్ ని విడుదల చేస్తూ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ గ్రౌండ్ లో వ్యూహం సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రకరిస్తున్నట్టు చెప్పడం జరిగింది.

ఈ షూటింగ్ కి వందల మంది జనాలు అవసరం పడటంతో ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తుంది. జూనియర్ ఆర్టిస్టులను పిలిపించి డబ్బు వృధా చేయటం ఎందుకు అనుకున్నారో తెలియదు కానీ ..ఈ అవకాశం మీ కోసం అంటూ సోషల్ మీడియాలో ప్రకటన చేయడం జరిగింది.
ఇక రాంగోపాల్ వర్మ విడుదల చేసిన వ్యూహం పోస్టర్ ని గమనిస్తే.. కులాల కోణంలో వర్మ కథ సాగుతుందా అనే ఆలోచన కూడా వస్తుంది. మరి ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ రాబోయే రోజుల్లో విడుదల చేస్తారో లేదో చూడాలి.