RGVs Hilarious Dance At Beautiful movie Pre Release Event
RGVs Hilarious Dance At Beautiful movie Pre Release Event

(RGVs (Ram Gopal Varma) Hilarious Dance At Beautiful movie Pre Release Event) సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా సినిమాలు తీసేస్తుంటాడు. అంతేకాదు వర్మ తనకు తోచితే సినిమా తీస్తాడు. తోచకపోయినా సినిమా తీయడం వర్మ నైజం. ఈ ఇయర్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో సంచలనం సృష్టించిన వర్మ.. ఆ తర్వాత ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలతో కావాల్సినంత కాంట్రవర్సీ క్రియేట్ చేసాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలిడి. ఇపుడు ‘ఎండర్ ది గర్ల్ డ్రాగతాన్ని రాబట్టలేకపోయింది.

నూతన సంవత్సర కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు వర్మ. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ తనలో ఉన్న దర్శకుడితో పాటు నిర్మాతగా సత్తా చూపాడు. అంతేకాదు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా..గాయకుడిగా, ప్రూవ్ చేసుకున్న త్వరలో నటుడిగా తన సత్తా చూపించడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా ఆయన తనలోని మరో యాంగిల్ పరిచయం చేసాడు. అది కూడా ఇంత వరకు ఎవరు చూడనది. ఆర్జీవి తొలిసారిగా ఒక స్టేజ్ మీద డ్యాన్స్ చేశాడు.

ప్రతి సినిమాకు కొత్త పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నాడు. ఈసారి ఆ పబ్లిసిటీ పీక్స్ కి వెళ్ళింది. స్టేజి మీద స్వయంగా రామ్ గోపాల్ వర్మ స్టెప్పులు వేసే వరకు వెళ్ళింది. అగస్త్య మంజు దర్శకత్వంలో రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా ‘బ్యూటిఫుల్’. ‘ట్రిబ్యూట్ టు రంగీలా’ అనేది సినిమా కాప్షన్. ఇందులో నైనా గంగూలీ హీరోయిన్. టైటిల్ కి న్యాయం చేసేలా నైనా గంగూలీ అందాలను ఎన్ని యాంగిల్స్ లో చూపించాలో… వర్మ అండ్ కో కలిసి అన్ని యాంగిల్స్ లో చూపించింది.

ఒక నిమిషం పైగా వర్మ డాన్స్ చేసి అందరినీ ఆశ్యర్యపరిచాడు. ఇదంతా .. వర్మ తన శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వంలో వర్మ నిర్మించిన బ్యూటిఫుల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగింది. ఇందులో ఈ సినిమా హీరోయిన్‌ నైనా గంగూలీతో కలిసి వర్మ డ్యాన్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.