RGV's Kamma Rajyam Lo Kadapa Reddlu Postponed!
RGV's Kamma Rajyam Lo Kadapa Reddlu Postponed!

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా విడుదలయ్యే అవకాశమే లేనట్లుంది. ఎందుకంటే సెన్సార్ బోర్డు సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా పేరును ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ మార్చి మరీ సెన్సార్ కు పంపించారు. అయితే సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు మాత్రం నిరాకరించారు. ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సభ్యులు వీక్షించి.. సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు, ప్రముఖులను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని తేల్చి చెప్పారు. అంతేకాకుండా సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వలేమని స్పష్టం చేశారు. దీంతో రివైజింగ్ కమిటీకి వెళ్లాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. మొదటి నుండి సినిమాలో అభ్యంతకర సన్నివేశాలు ఉన్నాయని ఓ వర్గం ఆందోళన చేస్తోంది. అంతేకాదు.. కొందరు కోర్టులకు కూడా ఎక్కారు. దీంతో వర్మ తన ఈగోను చంపుకుని మరీ పేరును మార్చారు.

సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ లభించకపోవడంతో విడుదల వాయిదా పడింది. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సినిమాలో ఏ కులాన్నీ తక్కువ చేయలేదని.. అంతా రూల్స్ ప్రకారం చేస్తే, ఏ సినిమా తీయలేమని అన్నారు. అంతేకాకుండా ఆ సినిమాలు విడుదల కూడా కావు అని ఆయన అన్నారు. అంతేకాకుండా సెన్సార్ అనేది ఔట్ డేటెడ్ ఇన్ స్టిట్యూషన్ అని చెప్పుకొచ్చారు. ఏ పార్టీ కోసమో, వ్యక్తి కోసమో ఈ సినిమా తీయలేదని వివరించారు. అందుకే తాను ఈ సినిమాకు సీక్వెల్ కూడా తీస్తున్నానని అన్నారు.

‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను నవంబర్ 29న విడుదల చేయాలని అనుకున్నాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..! అయితే ఆయన అనుకున్నట్లు జరగలేదు. సెన్సార్ జరగకపోవడం.. పలు కేసులు నమోదవ్వడంతో సినిమా విడుదల ఆగిపోయింది. అయితే వర్మ సినిమాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ పై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. టైటిల్ ను మార్చాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారులకు లేఖ రాశారు.