Rhea Chakraborty Whatsapp Chat With Drug Dealers leak

సుశాంత్ మృతి కేసులో రియా చక్రవర్తి మొన్నటి వరకు అనుమానితురాలిగా మాత్రమే ఉండేది. కాని ఇప్పుడు ఒకొక్కటిగా బయటకు వస్తున్న విషయాలు జరుగుతున్న ప్రచారాలు చూస్తుంటే ఆమె అనుమానితురాలు కాదు ఖచ్చితంగా దోషి అయ్యి ఉంటుందని సుశాంత్ అభిమానులు చాలా బలంగా నమ్ముతున్నారు. సుశాంత్ సూసైడ్ మిస్టరీలో ఇప్పటికే ఆయన‌తో సంబంధం ఉన్న 50 మందిని విచారించిన ముంబై పోలీసులు.. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని కీలకంగా తీసుకొని ఆధారాలు సేకరిస్తున్న క్రమంలో ఆమె డ్రగ్స్ డీలర్లతో చేసిన వాట్సాప్ చాట్ బయటకు రావడం సంచలనంగా మారింది.

ఇటీవల రియా చక్రవర్తికి డ్రగ్స్ డీలర్ తో సంబంధం ఉన్నట్లుగా ఆయనతో మాట్లాడినట్లుగా చాటింగ్ చేసినట్లుగా వెళ్లడి అయ్యింది అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో రియా లాయర్ ఆ విషయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాడు. రియాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పరీక్షలు చేసుకోవచ్చు అన్నాడు. డ్రగ్స్ విషయమై 2017 మార్చి నుంచి గౌరవ్‌తో రియా కాంటాక్ట్‌లో ఉన్నట్లు తేలడం షాకిస్తోంది. అంతేగాక అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మిథిలీన్‌ డయాక్సీ మెథాంఫేటమిన్‌ గురించి ఆమె ఆరా దీయడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇప్పుడు రియాకు డ్రగ్స్ డీలర్ తో సంబంధం ఉందని తెలియడంతే అది నిజమే అన్నట్లుగా వికాస్ సింగ్ ఆరోపిస్తున్నాడు. ఇదేగాక సుశాంత్ పర్సనల్ సిబ్బంది శామ్యూల్ మిరాండాతో రియా జరిపిన మరో మెసేజ్ వైరల్ అవుతోంది. నిశేదిత డ్రగ్స్ ను అతడికి ఇచ్చి బలవంతంగా చనిపోయేలా ప్రేరేపించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మొత్తం ఆధారాలను మంగళవారం రోజు సీబీఐకి అప్పగించారు ఈడీ అధికారులు. దీంతో రియా చక్రవర్తి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. త్వరలోనే సీబీఐ అధికారులు అరెస్టు చేసి ఫైనల్‌గా విచారణ చేపట్టనున్నారని తెలుస్తోంది.