రిచా గంగోపాధ్యాయ.. ఈ బ్యూటీ వెండితెరకు దూరమై చాలారోజులే అయినా ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. ‘లీడర్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ”మిరపకాయ్, మిర్చి” లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. సినీ పరిశ్రమలో ఉంటూనే చివరకు తన ప్రియుడిని పెళ్లిచేసుకొని ఓ ఇంటిదైపోయింది. తాజాగా ఓ సీక్రెట్ బయటపెడుతూ ఓపెన్ అయింది.
చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేల్లాను వివాహమాడిన రిచా గంగోపాధ్యాయ.. తాజాగా తన బేబీ బంప్ లుక్ పోస్ట్ చేస్తూ అసలు విషయం బయటపెట్టింది. తాను తల్లి కాబోతోన్నాని ఆనందం వ్యక్తం చేస్తూ తన భర్తతో కలిసి దిగిన ఓ పిక్ షేర్ చేసింది రిచా గంగోపాధ్యాయ. అలాగే తామెంతో సంతోషంగా ఉన్నామని తెలిపారు. తమ చిన్నారి కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని వెల్లడించారు. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
చివరగా 2013లో వచ్చిన ‘భాయ్’ సినిమాలో కనిపించింది రిచా గంగోపాధ్యాయ. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించి, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆమె అక్కడ బిజినెస్ స్కూల్లో జోను ప్రేమించారు. అనంతరం వివాహం చేసుకుకున్నారు.