Richa Gangopadhyaya Marriage Photos: పెళ్లి తర్వాత నటనకు స్వస్థి చెప్పింది రిచా గంగోపాధ్యాయ్. ‘లీడర్’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రిచా గంగోపాధ్యాయ.. ఆ తర్వాగ నాగవల్లి, మిరపరాయ్, సారొచ్చారు, మిర్చి, భాయ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పరంగా ఆశించిన స్థాయి దక్కకపోవడంతో ఆ తర్వాత ఎంబీఏ చదివేందుకు అమెరికా వెళ్లిపోయింది. క్లాస్ మేట్ ని పెళ్లాడేస్తున్నా అంటూ రిచా సడెన్ ట్విస్టిచ్చింది.
ఇటీవలే తన క్లాస్మేట్ని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం భర్తతో కలిసి సెలబ్రేషన్ కి సంబంధించిన ఫోటోల్ని ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఆయనే లోకంగా బతికేస్తోంది.. అయితే రిచా సడెన్‌గా సినిమా ఇండస్ట్రీకి దూరం కావడంపై అప్పట్లో రకరకాల వార్తలొచ్చాయి. ఇదే విషయంపై ఆమె తాజాగా స్పందించారు. ‘మార్కెటింగ్‌లో ఎంబీఏ చేయాలనేది నా చిన్ననాటి కల. ఆ ఛాన్స్ రావడంతో సినిమా ఇండస్ట్రీని వదిలేసి అమెరికా వెళ్లిపోయాను. చాలామంది సినిమాలకు దూరం కావొద్దని సలహాలు ఇచ్చినా.. నా మనసు ఎంబీఏ వైపే మొగ్గు చూపింది.
సినిమాలు వదిలేసి చదువుకోవడమే సరైన నిర్ణయమని భావించా. చదువు పూర్తి కాగానే నా క్లాస్‌మేట్‌నే పెళ్లి చేసుకున్నా. సినిమా ఇండస్ట్రీని వదిలేసినందుకు నాకేమీ బాధలేదు. నా భర్త జో లాంగెల్లా మిలటరీకి.. ఈ దేశాన్ని రక్షించడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన అన్ని శాఖల వారియర్స్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ తాజాగా ఎమోషనల్ ట్వీట్ చేసింది రిచా. తన భర్త అమెరికా మిలటరీ అధికారి అన్న సంగతిని మరోసారి గుర్తు చేసింది ప్రస్తుతం నా వైవాహిక జీవితం సాఫీగా సాగుతోంది’ అని చెప్పుకొచ్చింది రిచా.