Rishab Shetty Kantara 2 shooting starts from December 2023, Release will be October 2024, Kantara 2 (Prequel) shooting update, Kantara 2 Release Date, Kantara 2 latest news, Kantara 2 movie news, Kantara 2 BTS photos
రిషబ్ శెట్టి నటించి అలాగే దర్శకత్వం వహించిన కాంతారా సినిమా భారీ విజయాన్ని అందుకుంది విడుదలైన అన్ని భాషలను ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్స్ ని రాబట్టడం మనకి తెలిసిన విషయమే.. అయితే ఈ సినిమాకు సంబంధించిన కాంతారా 2 (Kantara 2 (Prequel)) సినిమాని కొన్ని నెలల క్రితం అనౌన్స్ చేశారు.. అయితే దీనికి సంబంధించిన షూటింగ్ అలాగే రిలీజ్ డేట్ ఈరోజు మేకర్స్ అఫీషియల్ గా చెప్పటం జరిగింది.
కాంతారా సినిమా గురించి మూవీ లవర్స్ అలాగే రిషబ్ శెట్టి (Rishab Shetty) ఫాన్స్ కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. ఈ (Kantara 2) మూవీ ఎటువంటి అప్డేట్ అయినా సరే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.. అందుతున్న సమాచారం మేరకు రిషబ్ శెట్టి ఈ సినిమాకి సంబంధించిన స్టోరీని అలాగే కావాల్సిన లొకేషన్స్ ని పూర్తి చేసినట్టు.. అలాగే డిసెంబర్ 2023 నుంచి షూటింగ్ కి వెళ్తున్నట్టు.. ఈ షూటింగ్ కూడా 3 షెడ్యూల్స్ లో పూర్తి చేయడానికి ప్లాన్ చేశారని తెలుస్తుంది.. ఇక ఆగష్టు 2024 లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని 2024 దసరాకి ఈ సినిమా విడుదల చేయాలని మేకర్స్ అన్ని రకాలుగా ప్లాన్ చేశారు.
ఈ కాంతారా 2 (Kantara 2) సినిమా కోసమని ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది.. అంతేకాకుండా కాంతారా సినిమా దాని కంటే బడ్జెట్ ఈ సినిమాకి భారీగానే పెంచారంట.. దానితోపాటు యాక్షన్ సన్నివేశాలు కూడా ఎక్కువగా ఉండేటట్టు స్టోరీని డిజైన్ చేసుకున్నట్టు సమాచారమైతే తెలుస్తుంది. ఇక రిషబ్ శెట్టి ఫాన్స్ కి అలాగే కాంతారా మూవీ ఫ్యాన్స్ కి ఇది ఒక పండగ లాంటి శుభవార్త.
మరి దసరా నెలలో విడుదల కాబోయే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ నుండి వచ్చిన సినిమాల్లో కేజిఎఫ్ ఒకటి భారీ కలెక్షన్స్ ని సాధించగా కన్నడ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ కలెక్షన్స్ ని సాధించిన రెండో సినిమాగా కాంతారా నిలిచింది..