Police case on Acharya Movie: చిరంజీవి అలాగే రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య ఈ సినిమా అన్ని హంగులు పూర్తి చేసుకుని ఫిబ్రవరి లో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి ప్రేక్షకుల్లో. మూవీ ప్రమోషన్లో భాగంగా టీజర్స్ అలాగే సాంగ్స్ రిలీజ్ చేస్తూ వెళ్తున్నారు మేకర్స్.
ఇటీవలే ఈ సినిమా నుంచి ‘శానా కష్టం…’ అనే ఐటెం సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకెళ్తుంది. ఈ సాంగులో చిరంజీవికి తోడుగా రెజీనా స్టెప్పులు కలిపింది. అయితే ఇప్పుడు ఈ సాంగ్ వివాదంలో చిక్కుకుంది. కొంతమంది ఆర్ఎంపీలు దీనిపై కేసు నమోదు చేయడం జరిగింది.
అసలు విషయానికి వస్తే, ఈ పాటలో ఒక లైన్ లో ”ఏడేడో నిమురోచ్చని కుర్రోళ్ళు ఆర్ఎంపీలు అవుతున్నారు” అని ఉంది. పాటలోని ఈ లైన్ RMP వృత్తిని అవమానపర్చే విధంగా ఉందని, RMP, PMPల మనోభావాలు దెబ్బతినే విదంగా ఉందని రాష్ట్ర RMPల సంఘం నాయకులు ఆరోపించారు.
ఇంతటితో వదిలేయకుండా ఈ సాంగులో లో ఈ లైను తొలగించాలంటూ కేసు నమోదు చేశారు అలాగే సినిమాలో ఈ పాటని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.