రౌడీ బాయ్స్ రివ్యూ: కాలేజీ డ్రామా

0
853
Rowdy Boys Movie Review in Telugu
Rowdy Boys Movie Review in Telugu

Rowdy Boys Telugu Movie Review

రేటింగ్ : 2.5/5
నటీనటులు: ఆశిష్, అనుపమ పరమేశ్వరన్, సహిదేవ్ విక్రమ్, కార్తీక్ రత్నం, తేజ్ కూరపాటి, కోమలీ ప్రసాద్.
దర్శకత్వం హర్ష కొనుగంటి
నిర్మాత దిల్ రాజు, శిరీష్
సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్

 

ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ హీరోగా శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందిన రౌడీ బాయ్స్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మించారు. మరి ఈ రోజు విడుదల అయిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం పదండి.

కథ :
అక్షయ్ (ఆశిష్) ఇంజినీరింగ్ స్టూడెంట్, కావ్య (అనుపమ పరమేశ్వరన్) మెడికల్ కాలేజీ స్టూడెంట్. అయితే, ఇంజినీరింగ్ – మెడికల్ కాలేజీ విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ నడుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్షయ్, కావ్యను చూసి ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమలో పడేయడానికి అక్షయ్ రిస్క్ చేసి మరీ మెడికల్ స్టూడెంట్స్ తో గొడవలకు దిగుతాడు.

ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం కావ్య, అక్షయ్ తో లివింగ్ రిలేషన్ తో ఉండటానికి అంగీకరిస్తోంది. అక్షయ్ మరియు కావ్య మధ్య ప్రేమ కథ రెండు క్యాంపస్‌ల మధ్య యుద్ధానికి దారి తీస్తుంది. తరువాత, అనుకోని సన్నివేశం కారణంగా, అక్షయ్ మరియు కావ్య ఇద్దరూ విడిపోతారు? ఈ జంట విడిపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? చాలా డ్రామా తర్వాత, కావ్య మరియు అక్షయ్ మళ్లీ ఎలా కలుస్తారు? అన్నది తెలియాలంటే దగ్గరలోని థియేటర్లలో సినిమా చూడాల్సిందే.

Rowdy Boys review in telugu
Rowdy Boys review in telugu

నటీనటులు:
లుక్ వైజ్, ఆశిష్ బాగున్నాడు కానీ నటన పరంగా మెరుగవ్వాలి మరియు అతని డైలాగ్ మాడ్యులేషన్‌పై చాలా కష్టపడాలి. హీరోయిన్ అనుపమ పరమేశ్వర అద్భుతం మరియు మెడికల్ స్టూడెంట్‌గా ఆమె రూపాంతరం బాగుంది. అనుపమ, ఆశిష్ మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ యూత్ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేస్తుంది. సహిదేవ్ విక్రమ్ మరియు కార్తీక్ రత్నం వంటి ఇతర నటీనటులు కళాశాల యువకులుగా తమ తమ పాత్రలకు సరిపోతారు.

మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. శ్రీహర్ష కొనుగంటి రాసిన కథ మరియు పాత్రలు కాలేజీ లైఫ్ ను, స్టూడెంట్స్ జీవితాల్లోని సంఘటనలను బాగా ఎలివేట్ చేశాయి.

Anupama Rowdy Boys movie review in telugu
Anupama Rowdy Boys movie review in telugu

దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు వినడానికి, చూడటానికి కూడా బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా అలరించింది. స్క్రీన్ మీద సినిమా ఇంత అందంగా కనిపించడానికి కారణం మది. ఆయన సినిమాటోగ్రఫీకి 100కి 100 మార్కులు వేయవచ్చు.

ప్ల‌స్ పాయింట్స్
అనుపమ పరమేశ్వరన్
స్టొరీ
క్లైమాక్స్

మైన‌స్ పాయింట్స్
స్లోగా సాగే కథాంశం
రెగ్యులర్ సీన్స్
సెకెండ్ హాఫ్

Rowdy Boys telugu movie review rating
Rowdy Boys telugu movie review rating

విశ్లేషణ:
హుషారు ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో రౌడీ బాయ్స్. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చేయాలనే ప్రాథమిక ఆలోచన బాగుంది కానీ హర్ష ఎక్కడో ఆకట్టుకునేలా సినిమాను ప్రదర్శించడంలో పట్టు కోల్పోయాడు. డీసెంట్ మ్యూజిక్ మరియు మంచి టెక్నికల్ టీమ్ వంటి ప్యాడింగ్ స్టఫ్ ఉన్నప్పటికీ, ప్రొసీడింగ్స్ చాలా డల్ గా కనిపించడంతో శ్రీ హర్ష ఈ సినిమాని గ్రాంట్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. దానికి తోడు రెండు భాగాల్లో కొన్ని అనవసర ఎపిసోడ్స్ కూడా సినిమాకు మైనస్‌గా మారాయి.

ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే..హీరో ఆశిష్ తనకు మొదటి సినిమా అయినా చాలా బాగా నటించాడు. ఆశిష్ పెర్ఫార్మెన్స్ అండ్ డ్యాన్స్ బాగున్నాయి. ఇక అనుపమ పరమేశ్వరన్ తన పాత్రకు ప్రాణం పోసింది. ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది.

Rowdy Boys review and rating
Rowdy Boys review and rating

అదే విధంగా సెకండ్ హాఫ్ లో వచ్చే హీరో మ్యూజికల్ జర్నీకి సంబంధించిన సన్నివేశాలు కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. వీటికి తోడు హీరో హీరోయిన్ల క్యారెక్టైజేషన్స్ కూడా అనవసరమైన ఎమోషన్ కి లోబడి.. మరి నాటకీయకంగా సాగుతున్న భావన కలుగుతుంది.

Rowdy Boys telugu review
Rowdy Boys telugu review

అక్షయ్, కావ్యకి దూరం అవ్వడానికి గల కారణం ఏమిటి ? ఊహించని పరిస్థితుల మధ్య అక్షయ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ? చివరకు అక్షయ్ – కావ్య ఒకరి కోసం ఒకరు ఏమి చేశారనేది మిగిలిన కథ. ఆశిష్, అనుపమల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. సినిమా అక్కడక్కడా కొంచెం స్లో అయినా.. అక్కడక్కడ విచిత్రంగా అనిపించినా.. నిరాశ మాత్రం పరచదు.

 

REVIEW OVERVIEW
CB DESK
Previous articleబంగార్రాజు రివ్యూ: ఫ్యామిలీ డ్రామా
Next articleBangarraju- Perfect film for festival