జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ కలిసి నటించిన RRR సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డును సొంతం చేసుకుంది. దర్శకుడు రాజమౌళి సినిమా సీక్వెల్ ఉంది అంటూ అలాగే RRR2 story వర్క్ జరుగుతుందని తెలియజేయడం జరిగింది.
ఇలా చెప్పారో లేదో ఇక మీడియా లో RRR పార్ట్ 2 సినిమాపై ప్రచారాలు ప్రారంభించారు. ఆర్ఆర్ఆర్ మూవీ ఎంత భారీ హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాని ఆస్కార్ నామినేషన్ కూడా ఎంపిక కావటంతో ప్రపంచ దేశాల్లో స్క్రీనింగ్ మొదలుపెట్టారు టీం.
కొన్ని రోజుల క్రితం ఆర్ఆర్ఆర్ సినిమాని జపాన్ లో కూడా విడుదల చేయడం జరిగింది. అక్కడ కూడా రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ లు ప్రచారంలో పాల్గొన్నారు. రాజమౌళి RRR పార్ట్ 2 గురించి సానకూలంగా స్పందించడంతో RRR2 story ఇదేనంటూ ప్రచారం జరుగుతోంది.
ఆర్ఆర్ఆర్ సీక్వెల్ సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ వేరువేరుగా తమ ప్రాంతాల గురించి పోరాటం కొనసాగిస్తారని..ఆ పోరాటంలో ఇద్దరూ మళ్లీ చివరకు దేశం కోసం పోరాటం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే చాలా బాగుంటుందని చాలా మంది ఆశిస్తున్నారు.
మరి దర్శక ధీరుడు రాజమౌళి RRR పార్ట్ 2 సినిమా స్టోరీ లైన్ ని ఎలా తెరపైకి చూపిస్తారు అనేది చాలామంది ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమా మొదలు కావడానికి ఇంకో రెండు సంవత్సరాలు టైం పట్టేలా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం దర్శకుడు రాబోయే సినిమా మహేష్ బాబు SSMB29 ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని 2024 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మహేష్ బాబు సినిమా విడుదలైన తర్వాతే RRR2 సినిమా సంబంధించిన వర్క్ ని మొదలు పెట్టడం జరుగుతుంది.