RRR Director Rajamouli Political entry: రాజమౌళి ప్రస్తుతం RRR మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. గత 6, 7 నెలలగా రామ్ చరణ్ (Ram Charan) జూనియర్ ఎన్టీఆర్ (NTR) కలిసి నటించిన ఈ సినిమా అమెరికాలో ఏదో ఒక ప్లేసులో విడుదల అవుతూనే ఉంది. దీంతో రాజమౌళి అలాగే టీం అమెరికా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. దీనితోపాటు సినిమా ఆస్కార్ నామినేషన్ లో ఉండటంతో రాజమౌళి (Rajamouli) సినిమా ప్రమోషన్స్ అలాగే ఇంటర్వ్యూస్ లో బిజీ అయిపోయారు.
RRR Director Rajamouli Political entry : ఈ కార్యక్రమాన్ని పూర్తయిన తర్వాత రాజమౌళి (Rajamouli) ఒక రెండు మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారు అంట. ఆ తర్వాత మహేష్ బాబు (Mahesh Babu) సినిమాకు సంబంధించిన పనుల్లో చూసుకోవాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే రాజమౌళి చేసుకున్న ప్లాన్లో మార్పులు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా రాజమౌళి (Rajamouli Political) రాజకీయాల్లోకి వెళ్తున్నట్టు తెలుస్తుంది.
అసలు విషయానికి వెళ్తే, రాజమౌళిని (Rajamouli) ఎన్నికల ప్రచార కార్యకర్తగా ప్రకటించడం జరిగింది. అయితే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో రాయచూరు జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా రాజమౌళిని నిర్మించినట్టు ఆ జిల్లాకి సంబంధించిన అధికారి అయిన చంద్రశేఖర్ నాయక్ వెల్లడించారు. తన సినిమాలతో థియేటర్లు హౌస్ ఫుల్ చేసినట్టు రాబోయే ఎన్నికలకు ప్రజలను కూడా అలాగే తీసుకు వస్తారని అధికారులు భావించారంట.
దీనికి సంబంధించిన డిస్కషన్ ఆల్రెడీ రాజమౌళితో (Rajamouli) జరపటం దానికి ఆయన ఒకే చెప్పటం కూడా జరిగిందని సమాచారం. రాయచూరు జిల్లా మాన్వి ,అమరేశ్వర క్యాంపులో రాజమౌళి (Rajamouli) జన్మించిన సంగతి తెలిసిందే. గతంలోనే కొన్ని సందర్భాల్లో తనకి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉందని చెప్పటం కూడా జరిగింది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటకలో చేయటం విశేషం. మరి ముందు ముందు రాజమౌళి కూడా మన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎటువంటి తన మార్క్ ప్రదర్శిస్తారో చూడాలి.