Jr NTR Upcoming Movies With Top Directors After RRR Movie
Jr NTR Upcoming Movies With Top Directors After RRR Movie

RRR …టాలీవుడ్ కి సంబందించిన ఇద్దరు స్టార్ హీరోలతో,400 కోట్ల భారీ బడ్జెట్ తో జక్కన్న చేస్తున్న మాసివ్ అటెంప్ట్ ఇది.ఇద్దరూ స్టార్ హీరోస్ కాబట్టి ఏ ఒక్క విషయంలో కూడా ఒకరు ఎక్కువ,ఒకరు తక్కువ అన్న ఒపీనియన్ ఫ్యాన్స్ కి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా రాజమౌళి కి ఉంది.అయితే ఈ సినిమాని టాలీవుడ్ బిగ్గీ గా కాకుండా పాన్ ఇండియా మూవీ గా భావిస్తున్న రాజమౌళి మాత్రం అవేమీ పట్టించుకున్నట్టు కనిపించట్లేదు.

అందుకే ఆగస్ట్ 15 కోసం RRR నుండి ఒక కీలకమయిన అప్డేట్ ఇస్తున్నాడట.కానీ అది కేవలం తారక్ ఫ్యాన్స్ కి మాత్రమే ఎక్సయిటింగ్ గా ఉండే అప్డేట్ అనేది సమాచారమ్.RRR నుండి ఎన్టీఆర్ నటిస్తున్న కొమరం భీమ్ లుక్ రిలీజ్ చెయ్యాలి అనేది జక్కన్న ప్లాన్.ఆ ఒక్క లుక్ బయటికి వస్తే బిజినెస్ ఏ రేంజ్ లో జరుగుతుంది అనేది మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లేదు.అదే ప్లాన్ తో రాజమౌళి అండ్ దానయ్య ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.దీనికి తోడు రామ్ చరణ్ గాయాలకారణంగా ఎక్కువ షూటింగ్ కి అటెండ్ కాకపోవడం,సైరా ప్రమోషన్స్ వల్ల కూడా RRR షూటింగ్ నుండి కూడా బ్రేక్ తీసుకున్నాడు.అందుకే NTR పై షూటింగ్ జరిపిన ఫుటేజ్ నుండి ఈ లుక్ డిజైన్ చేసినట్టు తెలుస్తుంది.