‘ఆర్‌ఆర్‌ఆర్‌ ‘ అనౌన్స్‌మెంట్

338
rrr-movie-annoucement-update
rrr-movie-annoucement-update

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే 80 శాతం పైగా షూటింగ్ జరుపుకున్నది. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు గా నటిస్తున్నారు. వీరిద్దరి వేర్వేరు ప్రాంతాలు.. వేరు వేరు కాలాలు. అయితే, ఈ సినిమాలో ఈ రెండు పాత్రలను ఎలా కలిపారు. ఎలా సినిమాను రన్ చేస్తున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే…

 

 

ఈ సినిమా తాలుకా టీజర్‌ను ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేకర్స్‌ రిలీజ్‌ చేయనున్నారని అనే వార్త బాగానే వైరల్‌ అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా మేకర్స్‌ తాజాగా సర్‌ఫ్రైజ్‌ అప్డేట్‌ ఇచ్చారు. మధ్యాహ్నం ఈ మూవీ నుంచి బిగ్గెస్ట్‌ అనౌన్స్‌మెంట్‌ రానున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. దీంతో ఎన్టీఆర్‌, రాంచరణ్‌ ఫ్యాన్స్‌లో ఉత్సాహం మొదలైంది.  ఇక ఆ సర్‌ఫ్రైజ్‌ ఏంటో మధ్యాహ్నం 2 గంటల వరకు ఎదురు చూడాల్సిందే.