‘RRR’ లో ఫ్యాన్స్‌ ఊయించని క్లైమాక్స్ .. కానీ ?

793
RRR Movie Climax and Rajamouli Makes it in Negative ending
RRR Movie Climax and Rajamouli Makes it in Negative ending

విక్రమార్కుడు, బాహుబలి, మగధీర లాంటి సినిమాలలో హీరోను చంపేసినా కూడా చాలా ఎమోషనల్‌గా చూపించాడు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా విషయంలోనూ ఇదే చేయబోతున్నాడు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు.

 

ఈ ఇద్దరూ కూడా బ్రిటీష్ వాళ్లతో పోరాటంలో భాగంగా ఆ ఇద్దరూ వైకల్యం పొందుతారని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పాత్రకు కళ్లు పోతే.. రామ్ చరణ్ పాత్ర కాళ్లు కోల్పోతుందని వార్తలు వస్తున్నాయి.

 

మరియు ఎన్టీఆర్, రామ్చరణ్ ని బుజాల పైకి ఎక్కించుకొంటాడు అప్పుడు రాంచరణ్ బ్రిటిష్ వాళ్ళకి బాణాలు వేస్తూ ఉంటాడు అంట ! ఇదే కనక జరిగితే, ఈ సీన్ కి థియేటర్లో ఫ్యాన్స్‌ రచ్చ మాములుగా ఉండదు అనుకొంటా !

 

 

దేశం కోసం తమ ప్రాణాలు సైతం లెక్కచేయని వీర సైనికులుగా ఇందులో నటిస్తున్నారు వాళ్లు. అయితే అంతా అనుకుంటున్నట్లు ట్రిపుల్ ఆర్ దేశభక్తి సినిమా కాదని.. స్నేహం విలువ చెప్పే కథ అంటున్నాడు రాజమౌళి. అయితే క్లైమాక్స్‌లో కళ్లు, కాళ్లు పోయినా కూడా ట్రాజిక్ క్లైమాక్స్‌లా కాకుండా చాలా ఎమోషనల్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు రాజమౌళి.
అయితే రిలీజ్‌కు ఆర్నెళ్ల ముందుగానే కావాలనే క్లైమాక్స్ గురించి ఫీలర్ వదిలారని తెలుస్తుంది. దీనికి వచ్చే రెస్పాన్స్ బట్టి మార్చాలా లేదంటే అలాగే ఉంచాలా అనేది నిర్ణయించుకోనున్నారు దర్శక నిర్మాతలు. త్వరలోనే రామ్ చరణ్, అలియా భట్‌పై రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించనున్నాడు దర్శకుడు రాజమౌళి.