RRRలోని భావోద్వేగాలకు జనని పాట నిదర్శనం: రాజమౌళి

0
52
RRR Movie Director SS Rajamouli Comments on Janani Song

RRR Movie Director SS Rajamouli Comments on Janani Song – RRR Movie Songs -RRR MP3 Songs – NTR – Ram Charan

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR Movie). నిర్మాత దానయ్య ఈ సినిమాని సుమారు 450 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో చేస్తున్న విషయం తెలిసిందే. ప్రమోషన్స్లో భాగంగా రేపు జననీ సాంగ్ (Janani Song) ని రిలీజ్ చేస్తున్నారు.

ఇందులో భాగంగా నవంబర్‌ 26న ‘జనని’ అనే పాట విడుదల చేయనుంది. దేశభక్తిని చాటే విధంగా రూపొందించిన ఈ పాటను గురువారం ఉదయం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ విలేకర్ల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించింది. పాట విడుదల కార్యక్రమంలో రాజమౌళి, నిర్మాత దానయ్య పాల్గొన్నారు.

ఈ ప్రెస్ మీట్ లో రాజమౌళి (Rajamouli) గారు మాట్లాడుతూ.. ‘‘జనని’ (Janani) పాట ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకి ఓ సోల్‌. ఈ పాట కోసం కీరవాణి అన్నయ్య రెండు నెలలు శ్రమించారు. ఆయనే ఈ పాటకు లిరిక్స్ కూడా రాశారు. డిసెంబర్‌ మొదటి వారంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ (RRR Trailer) విడుదల చేస్తాం. సినిమా ప్రమోషన్స్‌ భారీగానే ప్లాన్‌ చేశాం. అని చెప్పుకొచ్చారు.

Rajamouli press meet for Janani song from RRR Movie
Rajamouli press meet for Janani song from RRR Movie

జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. చరణ్‌కు జోడీగా ఆలియాభట్‌, ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు.

 

Previous articlePragya Jaiswal Hot Collections
Next articleఅఖండ ఒక హై ఓల్టేజ్ సినిమా – శ్రీకాంత్