RRR Movie Postponed, Bheemla Nayak For January 12: కరోన కారణంగా మళ్ళీ సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. వాస్తవానికి జనవరి 7న విడుదల కావాల్సిన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి రూపొందించిన భారీ చిత్రం RRR Movie Postponed అని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది.

ఇప్పటికే రెండు సార్లు పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా, మళ్లీ డేట్ చేంజ్ అనే టప్పటికీ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ కు నిరాశ చెందారు. నిజానికి RRR Movie 2020 జూలై 30న విడుదల కావాల్సిన చిత్రం. అప్పటి నుంచి వాయిదా పడుతూనే వస్తుంది.
అందుకు కారణం కోవిడ్ మళ్లీ తన పంజా విసరడం ప్రారంభించింది. ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండటానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధిస్తూ వస్తున్నాయి. దీంతో విడుదలకు నోచుకోని కొన్ని పెద్ద సినిమాలు అలాగే చిన్న సినిమాలు లైన్ లోకి వస్తున్నాయి.

RRR Movie కోసం పోస్ట్ ఫోన్ అయితే, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భీమ్లా నాయక్ (Bheemla Nayak) ఇప్పుడు రిలీజ్ చేసే పనిలో పడ్డారు మేకర్స్. భీమ్లా నాయక్ ఇప్పుడు 12 జనవరి, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. భీమ్లా నాయక్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్టైన్మెంట్స్ పని చేస్తోంది.
భీమ్లా నాయక్ పెండింగ్ ప్రొడక్షన్ పనులను 5 నుంచి 6 రోజుల్లో పూర్తి కావచ్చని సమాచారం తెలుస్తుంది. కాబట్టి భీమ్లా నాయక్ అనుకున్న టయానికి ఇంగ్లీష్ కావచ్చునని సినిమాకు సంబంధించిన వారి దగ్గర నుంచి సమాచారం అందుతుంది.

ప్రభాస్ పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ విడుదల కూడా అనూహ్య పరిస్థితుల దృష్ట్యా అనుమానంగానే ఉంది. రాధే శ్యామ్ జనవరి 14న సినిమాల్లోకి వస్తారా లేదా అన్నది స్పష్టంగా తెలియలేదు. రాధే శ్యామ్ కూడా వాయిదా పడే అవకాశం ఉంది. సంక్రాంతి రిలీజ్ డేట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.