RRR Movie Surprize For Fans Tomorrow

RRR Movie Update Tomorrow: ‘బాహుబలి’ సీరీస్ తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. షూటింగ్ ఏడు నెలల తర్వాత తిరిగి ప్రారంభమైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కంటిన్యూగా రెండు నెలలు షూటింగ్ ప్లాన్ చేసుకున్నామని ప్రకటించిన రాజమౌళి.. చిత్రీకరణ మొదలుపెట్టేశాడు. ఈ క్రమంలో నేటి నుంచి ఈ చిత్రం షూటింగును హైదరాబాదు సమీపంలోని రామోజీ ఫిలిం సిటీలో నిర్వహిస్తున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా, పూర్తి రక్షణ చర్యలు తీసుకుంటూ ఈ చిత్రం షూటింగును ప్రారంభించినట్టు సమాచారం.

అలా షూటింగ్ స్టార్ట్ చేసాడో లేదో ఇలా వెంటనే ‘ఆర్.ఆర్.ఆర్’ నుంచి రేపు(మంగళవారం) అప్డేట్ రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ”మమ్మల్ని తిట్టడంలో మీ అసమానమైన సృజనాత్మకత పోస్టులు ఇక చాలు. మీ ప్రేమతో మమ్మల్ని ఉత్తేజ పర్చినందుకు ధన్యవాదాలు. సమయం గడిచింది. చివరకు ఆ క్షణం వచ్చేసింది. ఇప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం మా వంతు. రేపటి కోసం వేచి ఉండండి” అంటూ ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్ ట్వీట్ చేసింది.

ఇక ఈ విజయదశమికి ‘ఆర్ఆర్ఆర్’ నుంచి కానుకగా ఎన్టీఆర్ కి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేసే యోచనలో చిత్రం యూనిట్ వుంది. అందుకు తగ్గా షాట్స్ ను కూడా ముందుగా షూట్ చేస్తున్నారట. ఇదిలావుంచితే, రేపు (మంగళవారం) ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్ డేట్ ను ఇవ్వనున్నట్టు చిత్రం యూనిట్ ఈ రోజు ప్రకటించింది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ ‘ఆర్ఆర్ఆర్’ను పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు.