ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ పూర్తి..!

0
882
RRR Movie Team Has Wrapped Up The Entire Shoot

RRR Movie Shooting: ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్ఆర్‌’. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు చిత్ర బృందం గురువారం ప్రకటించింది. చిన్నచిన్న షాట్స్ మినహా ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం.

స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2018 నవంబరు 19న ఏదైతే బైక్‌ షాట్‌తో షూటింగ్‌ మొదలు పెట్టామో అదే బైక్ షాట్‌తో షూటింగ్‌ పూర్తవడం నిజంగా యాదృచ్ఛికం. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ ఇస్తామని చిత్రయూనిట్ వెల్లడించింది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన దోస్తీ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అలియా భట్‌, ఓలివియా మోరిస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.