RRR New logo Did Roudram shake hands

RRR Movie New Poster: రౌద్రం రణం రుధిరం … (RRR) టైటిల్ కి తగ్గట్టే పాన్ ఇండియా కేటగిరీలో మరో భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఐదారు నెలల గ్యాప్ తర్వాత అన్ లాక్ ప్రక్రియలో ఈ మూవీ పెండింగ్ షూటింగ్ ని వేగంగా ముగించేందుకు జక్కన్న షూట్ స్టార్ట్ చేశారు. తాజాగా, ఈ సినిమా నుండి మరో పోస్టర్‌ ను ఆర్‌ఆర్‌ఆర్‌ తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

ఎన్.టి.ఆర్ – రామ్ చరణ్ లపై కీలక సన్నివేశాల్ని డిసెంబర్ లోపు పూర్తి చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేశారు. 10 అక్టోబర్ రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ కొత్త లోగోను విడుదల చేశారు. లోగోలో రెండు చేతులు ఒకదానితో ఒకటి కలిసి యునైటీని ఆవిష్కరించాయి. వెనుక అశోక ధర్మ చక్రం, ముందు అల్లూరి, భీమ్‌ చేతులు కలిపినట్లు ఈ పోస్టర్‌ ఉంది. ఇప్పటికే రామ్‌చరణ్‌ లుక్‌ను విడుదల చేసిన చిత్రబృందం కొమరం భీమ్‌గా ఎన్‌టిఆర్‌కు సంబంధించిన టీజర్‌ ను ఈ నెల 22న విడుదల చేయనున్నారు.