RRR rajamouli ntr teaser release date fix here are the details

RRR Rajamouli Jr NTR Komaram bheem Look: ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్ (NTR Teaser) రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ అయినట్టు సమాచారం.

RRR rajamouli ntr teaser release date fix here are the details

పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ కోసం సరికొత్త ప్లాన్స్ చేస్తున్నారు రాజమౌళి. ఎంత ఆలస్యమైనా అవుట్‌ఫుట్ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. ఈ నేపథ్యంలోనే అతిత్వరలో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని ఖుషీ చేసేలా ఓ ఆసక్తికర అప్‌డేట్ ఇవ్వబోతున్నారట జక్కన్న. ఇందుకోసం పక్కాగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఇప్పటికే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ గెటప్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఎన్టీఆర్ పుట్టినరోజుకు ఏదైనా టీజర్ వస్తుందని ఆశించిన ప్రేక్షకులకు మాత్రం నిరాశే మిగిలింది. అప్పటికే దేశంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో తారక్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయలేకపోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో షూటింగ్ ప్రారంభించాలనుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే నెల నుంచి మొదలు పెట్టనున్నారు.

RRR rajamouli ntr teaser release date fix here are the details

ఈ సందర్భంగా దసరాకు ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే టీజర్ కట్ చేసినట్టు సమాచారం. కీరవాణి ఇప్పటికే ఈ టీజర్‌కు ఆర్ఆర్ సమకూర్చే పనిలో ఉన్నాడు. ఇప్పటికే కీరవాణి ఇచ్చిన ఆర్ఆర్ పై జక్కన్న అంత సంతృప్తిగా లేడట. అందుకే లేటైనా పర్వాలేదు.. టీజర్ అదిరిపోయేలా ఉండాలని అన్న కీరవాణికి చెప్పినట్టు సమాచారం.

ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవగన్, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కొమురం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ చరిత్రలో నిలిచిపోయే పాత్రలు చేస్తున్నారు.