RRR update Olivia Morris has been roped in to play the female lead opposite Jr NTR
RRR update Olivia Morris has been roped in to play the female lead opposite Jr NTR

రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం RRR. మెగాస్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నిన్న ఒక్కసారి గా ఓ అనౌన్స్ మెంట్ తో అందరికీ షాక్ ఇచ్చారు. నవంబర్ 20న(ఈరోజు) ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ తో పాటు విలన్ క్యారెక్టర్స్ ఎవరు చేస్తారు అనే విషయాన్ని రెవీల్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీనితో ఆర్.ఆర్.ఆర్’ సినిమా వున్నా రూమర్లు కోటేసారు..

ఒలీవియా మోరిస్ అనే ఇంగ్లీష్ బ్యూటీని ఎన్టీఆర్ కి జోడిగా సెట్ చేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ సరసన RRRలో అలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక తారక్ సరసన హీరోయిన్ గా ఎవరు కనిపిస్తారు అనే విషయంలో గతకొంత కాలం నుంచి వస్తున్న రూమర్స్ కి క్లారిటీ వచ్చేసింది. ఐర్లాండ్ కు చెందిన ఈ నటి ఇండియానా జోన్స్(1989),టాఫిన్, మేజర్ లీగ్ 2 వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈమధ్య కాలంలో ఆలిసన్ డూడి 2017లో వచ్చిన ‘డేవిడ్ సన్’ 19 చిత్రంలో నటించింది.

అప్పటి బ్రిటిష్పాలకుల కుటుంబానికి చెందిన జెన్నిఫర్ గా ఒలీవియా RRRలో దర్శనమివ్వనుంది. మరి తారక్ తో ఆమె నటన ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయ్యింది అని చెప్పడాన్ని బట్టి చూస్తే వారు అనుకున్న టైంకే సినిమాని విడుదల చేయబోతున్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పినట్టు తెలుస్తుంది.