బ్రేకింగ్: RRR వాయిదా.. రాజమౌళి షాకింగ్ నిర్ణయం..??

0
848
RRR Postponed! Rajamouli film to have new release date of RRR Movie
RRR Postponed! Rajamouli film to have new release date of RRR Movie

(New release date of RRR – SS Rajamouli’s directorial venture RRR starring Mega Power Star Ram Charan and Young Tiger Jr NTR) టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న పాన్ ఇండియా భారీ మల్టీస్టారర్ మూవీ RRR పై దేశవ్యాప్తంగా ఎంతటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిజానికి కేవలం మన దేశంలోనే కాక, పలు ఇతర దేశాల ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే సినిమాను అనౌన్స్ చేసినప్పుడే RRR రిలీజ్ డేట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అలానే తొలిసారిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమాను దాదాపుగా రూ.450 కోట్ల బడ్జెట్ తో రాజమౌళి తెరకెక్కిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలయికతో ఈ భారీ ప్రాజెక్టును జూలై 30న రిలీజ్ లక్ష్యంగా ప్లాన్ చేశారు. అయితే సినిమా షూట్ మొదలు పెట్టినప్పటి నుంచి ఏదోరకమైన ఆటంకం ఎదురవుతూనే ఉంది. దాంతో ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేసినట్టు సమాచారం. ప్రాజెక్టుకు పలు అవాంతరాలు
RRR షూటింగ్ మొదలైనప్పటి నుంచి హాలీవుడ్ హీరోయిన్ సినిమా నుంచి తప్పుకోవడం, ఆ తర్వాత రాంచరణ్, ఎన్టీఆర్ గాయాలపాలు కావడంతోపాటు సినిమాకు పలు అవాంతరాలు ఎదురయ్యాయి. దాంతో నటీనటుల కాల్షీట్స్, ఇతర సాంకేతిక సమస్యలు ఎదురైనట్టు సినీ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సినిమా యూనిట్ ఇప్పటికే ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. అయితే కాసేపటి క్రితం ప్రముఖ మూవీ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ చేసిన ఒక ట్వీట్ తో ఈ సినిమా వాయిదా పడింది అనే సంకేతాలు అందుతున్నాయి.

ఇది ఎక్స్‌క్లూజివ్.. ఓ భారీ చిత్రం, దక్షిణాది నుంచి ఓ బ్లాక్‌బస్టర్ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ సినిమా వాయిదా పడింది. ఆ సినిమా కోసం ముందుగా ప్రకటించిన డేట్ కంటే మరో డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఆ క్రేజీ ప్రాజెక్ట్‌ను అక్టోబర్ 2020లో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. దాంతో ఈ సినిమా అక్టోబర్ 23న రిలీజ్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ సినిమా ఏమిటో గుర్తు పట్టండి అని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

అయితే అయన పోస్ట్ పెట్టిన కాసేపటికే ఆ ట్వీట్ నేషనల్ వైడ్ గా ఎంతో సంచలనం రేపుతోంది. కాగా ఆయన చెప్పిన ఆ సంచలన న్యూస్ తప్పకుండా ఆర్ఆర్ఆర్ మూవీ గురించే చాలామంది నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు మాత్రం అది కెజిఎఫ్ చాప్టర్ 2 కి సంబందించిన న్యూస్ కూడా అయి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి…..!!

 

Previous articleMahesh Babu’s film on a rampage: earns Rs 100 crore in a week
Next articleStar hero’s cameo in RRR Movie