RRR Movie Promotional Song: రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న RRR సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో ప్రమోషనల్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. “RRR” చిత్ర బృందం ప్రమోషన్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే “Roar Of RRR” అంటూ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది.
ఈ సాంగ్ స్పెషల్ ఏంటంటే ఇందులో ప్రత్యేకంగా తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా పాలు పంచుకున్నాడు. జరుగుతున్న ప్రచారం ప్రకారం అనిరుధ్ “RRR” ప్రమోషనల్ సాంగ్ కి సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాకు ప్రధానంగా ఎంఎం కీరవాణి స్వరాలు సిద్ధం చేస్తున్నారు. కానీ ప్రత్యేక ప్రమోషనల్ సాంగ్ కోసం మాత్రం మేకర్స్ అనిరుధ్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ పాట కోసం దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలతో సెట్ వేశారట. ఈ పాటలో చిత్రంలో నటించిన వారు దాదాపుగా అంతా కూడా కనిపించబోతున్నారట. టెక్నీషియన్స్ మరియు తెర వెనుక పని చేసిన ఇంకా చాలా మందిని కూడా ఈ పాట లో చూపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా అన్ని భాషల్లో కూడా ఈ పాట ఉంటుందట. భాషకు తగ్గట్లుగా ఆ పాట మారుతుందని కూడా టాక్ వినిపిస్తుంది.
రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు ఈ పాటలో వేయబోతున్న స్టెప్పులు ఇతర యూనిట్ సభ్యులు చేయబోతున్న సందడి అంతా కూడా చాలా ప్రత్యేకం గా ఉంటుందనే నమ్మకం ను మీడియా వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదలకు ముందే ఈ ప్రమోషనల్ సాంగ్ ను విడుదల చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
సాంగ్ పూర్తయ్యాక మొత్తం టీం జార్జియాకు ప్రయాణం కానుంది. అక్కడ సినిమాలోని భారీ సాంగ్ ను చిత్రీకరిస్తారు. దాంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇక నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో డీవివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగన్ ఇద్దరూ మరో రెండు ప్రధాన ఆకర్షణలు. ఈ ఏడాది అక్టోబర్ 13న “RRR” విడుదల కానుంది.