ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ప్రోమో రెడీ..!

419
RRR Star Jr Ntr Meelo Evaru Koteeswarudu Promo To Be Out Next Week

పాపులర్ రియాలిటీ గేమ్ షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కొత్త సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్టు ఇప్పటికే ఖరారైంది. షో ఫార్మట్ లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే ఎన్టీఆర్ పై ప్రోమో షూట్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ ప్రోమో క్రియేటివ్‌గా రూపొందుతోందని సమాచారం.

ఈ ప్రోమో వచ్చే వారం అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. ఈ ప్రోమోతో ప్రచార కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉత్తరాదిన సూపర్ హిట్ అయిన కేబీసీ(కౌన్ బనేగా కరోడ్ పతి) ని తెలుగులో మొదట నాగార్జున హోస్ట్ గా ఎంఈకే(మీలో ఎవరు కోటీశ్వరుడు) గా తీసుకు వచ్చారు. చిరంజీవి కూడా హోస్టింగ్ చేశారు. మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వారం పది రోజుల్లో ఎన్టీఆర్ ప్రోమోను జెమిని టీవీ వారు టెలికాస్ట్ చేయబోతున్నారట.

పేరు కాస్త మార్చి జెమిని టీవీలో ఎన్టీఆర్ కేబీసీ ని ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ అంటూ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు ఎన్టీఆర్ క్రేజ్ ను ఉపయోగించుకునేందుకు జెమిని వారు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెల నుంచి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ టీవీలో ప్రసారమవుతుందని సమాచారం. ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అంతా పూర్తయిందట. ఈ సీజన్ జెమిని టీవీలో ప్రసారం కానుంది.