జెమిని టీవీ రియాల్టీ షో చేస్తున్నఎన్టీఆర్..?

639
RRR Starrer Jr NTR To Host A Show On Gemini TV Soon

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెర పై కనిపిస్తే చాలు అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 1 కు హోస్టింగ్ చేసి ఆకట్టుకున్నాడు. మొదటి సీజన్ కు వచ్చిన రేటింగ్ అంతా ఇంతా కాదు. ఆతర్వాత మళ్లీ బిగ్ బాస్ సీజన్ 2 కు కూడా ఎన్టీఆర్ హోస్ట్ గా వస్తారనుకున్నారు కానీ.. సినిమాల్లో బిజీగా ఉండడం వలన కుదరలేదు. ఎన్టీఆర్ నో చెప్పడంతో బిగ్ బాస్ సీజన్ 2కు హీరో నానిని హోస్ట్ గా చేసారు. కానీ ఇపుడు ఎన్టీఆర్ మరో బుల్లి తెర షో కు రెడీ అవుతున్నట్లుగా విశ్వసనీయంగా సమాచారం అందుతోంది.

ఇది బ్రేకింగ్ న్యూస్ అని చెప్పచ్చు. ఎందుకంటే.. ఓ వైపు ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ తో నెక్ట్స్ సినిమా చేయడానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రెడీగా ఉన్నారు కానీ.. డేట్స్ ఇవ్వలేదు. ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి టైమ్ లో ఎన్టీఆర్ ఓ రియాల్టీ షోకు టైమ్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. సినీ వర్గాల వారి నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ హోస్ట్ గా జెమిని ఛానెల్ లో ఒక షో కు రంగం సిద్దం అయ్యింది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్టింగ్ ను వేయిస్తున్నారట. జెమిని టీవీలో ప్రసారం కాబోతున్న ఎన్టీఆర్ షో రియాల్టీ షో నా లేదా టాక్ షో నా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

షో ఏదైనా కూడా జెమిని టీవీలో ఎన్టీఆర్ కనిపించడం మాత్రం పక్కా అంటూ మీడియా వర్గాల వారు చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఎన్టీఆర్ రియాల్టీ షో చేయనున్నారు అనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అసలు ఈ షో ఏంటి.? ఇందులో ఏం చెప్పబోతున్నారు.? ఎప్పుడు స్టార్ట్ కానుంది..? ఒకటి రెండు వారాల్లో జెమిని టీవీ ఎన్టీఆర్ షో కు సంబంధించి పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మరి.. ఈ షో ద్వారా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తారో చూడాలి.