ఆర్ఆర్ఆర్ నుండి అదిరిపోయే యాక్షన్ సీన్ వీడియో

RRR’s sensational action scene being shot on a big scale

RRR Shooting Video: ‘బాహుబలి’ సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ చిత్రం ఆర్ఆర్ఆర్. చరిత్ర, ఫిక్షన్‌ అంశాల కలబోత ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తోన్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ చిత్రం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రీస్టార్ట్ అయింది.

ఆర్ఆర్ఆర్ టీమ్ తమ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేసింది. బ్రిటిష్ వారితో ఇందులోని హీరోలు పోరాడుతోన్న సీన్లకు సంబంధించిన షూటింగును తీస్తున్నట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా నైట్ షూట్ తీస్తున్నామని, యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నామని ఆర్ఆర్ఆర్ టీమ్ చెప్పింది. బ్రిటిష్ వారితో ఇందులోని హీరోలు పోరాడుతోన్న సీన్లకు సంబంధించిన షూటింగును తీస్తున్నట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా నైట్ షూట్ తీస్తున్నామని, యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నామని ఆర్ఆర్ఆర్ టీమ్ చెప్పింది. దీన్ని థియేటర్‌లో చూసేటప్పుడు మరో లెవల్లో ఉంటుందని ఆ యూనిట్ సభ్యుడు ఒకరు చెప్పారు.

 

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *