Rum Pum Bum Lyrical Song From Ravi Teja Disco Raja Movie
Rum Pum Bum Lyrical Song From Ravi Teja Disco Raja Movie

(Rum Pum Bum Lyrical Song From Ravi Teja Disco Raja Movie) మాస్ మహారాజా రవితేజ హీరోగా పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్స్ గా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైఫై యాక్షన్ ఫిలిం ‘డిస్కోరాజా’. ఈ సినిమా అన్నీ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఇక గ్రాండ్ గా జనవరి 24 న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే రెండు టీజర్లు.. రెండు పాటలు రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఇవి ఇపటికే మాస్ రాజా ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక తాజాగా ఈ సినిమా నుండి ‘రమ్ పమ్ బమ్’ అంటూ సాగే డిస్కో స్టైల్ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు చిత్ర బృందం.’డిస్కోరాజా’ సినిమాకి సంగీత దర్శకుడు తమన్. మాంచి ఫాం లో తమన్ ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు . మాస్ మహారాజా రవితేజ.. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి..సింగర్ శ్రీకృష్ణ పాడారు. ఎస్పీబీ పాడిన ‘నాతో ఏం అన్నావో’ అనే ఆ పాట బాగా వైరల్ అవుతోంది.ఇప్పుడు మరో వింటేజ్ ట్యూన్ అనేట్లుగా బప్పీ లహరితో ఓ పాట అందించారు. తెలుగు మాస్ ప్రేక్షకులకు దగ్గరయిన ఏకైక ఉత్తరాది సంగీత దర్శకుడు ఆయన. ఒకప్పుడు కృష్ణ, చిరంజీవి లాంటి హీరోల సినిమాలకు ఉర్రూతలూగించే పాటలు అందించిన మ్యూజిక్ డైరక్టర్ బప్పీలహరి.

‘కాలం ఆగాలి నా కాలి వేగం చూసి..లోకం ఆగాలి నా వేలి సైగే చూసి’ అంటూ సాగే ఈ పాటను హీరో రవితేజ తో కలిసి బప్పీలహరి పాడారు. బప్పీలహరి స్టయిల్ ను గుర్తుకు వచ్చేలా థమన్ ట్యూన్ అందించారు.ఒక సీనియర్ హీరో, ఒక యంగ్ హీరో అనేట్లుగా రెండు క్యారెక్టర్లు చేస్తున్నారు రవితేజ ఈ సినిమాలో అందుకు తగినట్లుగానే థమన్ రెండు వింటేజ్ ట్యూన్ లు అందించారు. ఇక రవి తేజ పాట మధ్యలో “ఆఆ.. రమ్ ప బమ్ రబరిబ” అంటూ చేసిన హమ్మింగ్ పాటకు హైలైట్ గా నిలిచింది. డిస్కో పాటకు ఈ హమ్మింగే సగం హైప్ ని తీసుకొస్తుంది. అసలే సూపర్ ఫామ్ లో ఉన్న తమన్ ఈ పాటతో కూడా తన ఫామ్ ని ఇంకా కంటిన్యూ చేశాడు. మాస్ ఆడియన్స్ కు వెంటనే కనెక్ట్ అవుతూ అందరికీ నచ్చేలా థమన్ ఈ సాంగ్ ని కంపోజ్ చేశాడు.