Rumours That Kajal Aggarwal Is Going To Marry Businessman

Kajal Aggarwal Marriage: టాలీవుడ్ లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వచ్చాయి. ముంబైలో స్థిరపడ్డ బడా వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లు అనే వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ఇప్పటికే రహస్యంగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుందని.. ఈ ఏడాది పెళ్లి వేడుక ఉండే అవకాశం ఉందని.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని పుకార్లు షికారు చేసాయి. కాగా బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం కాజల్ అగర్వాల్ ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లుని త్వరలోనే వివాహం చేసుకోనుందని తెలుస్తోంది. వెడ్డింగ్ సూత్రం కథనం ప్రకారం త్వరలో కాజల్ – గౌతమ్ ల పెళ్లి తేది కూడా ఖరారు చేయనున్నారట.. అయితే దీని గురించి కాజల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు.