Homeసినిమా వార్తలుప్రొడక్షన్ నెంబర్ 1తో మన ముందుకు వస్తున్న సహస్ర ఎంటటైన్మెంట్స్

ప్రొడక్షన్ నెంబర్ 1తో మన ముందుకు వస్తున్న సహస్ర ఎంటటైన్మెంట్స్

సహస్ర ఎంటటైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభం అయ్యాయి. విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా బసి రెడ్డి రాన దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

బొమ్మరిల్లు భాస్కర్, సుద్దాల అశోక్ తేజ ఈ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హైదరాబాద్, కర్నూల్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. నరేంద్ర బుచ్చి రెడ్డిగారి నిరిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 14 నుండి ప్రారంభం కానుంది.

సాక్షి రంగారావు అబ్బాయి సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కాబోతున్నాయి. సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం నిర్మితమవుతుంది.

Sahasra Entertainments New Film Launch

Sahasra Entertainments New Film Launch

Sahasra Entertainments New Film Launch
Sahasra Entertainments New Film Launch

Related Articles

Telugu Articles

Movie Articles