యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) దాదాపు ఒకటిన్నర సంవత్సరం క్యాప్ తర్వాత నటించిన చిత్రం విరూపాక్ష. ఓ మోస్తారు అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఎవరు ఊహించని విధంగా గ్రాండ్ సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయిన ఈ చిత్రం సాయి ధరమ్ తేజ స్టేటస్ ని యావరేజ్ హీరో నుంచి ఓరకంగా స్టార్ హీరో రేంజ్ కి తీసుకువెళ్లిందని చెప్పవచ్చు.
ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ (Sai Dharam Tej) యాక్షన్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పటివరకు నటించే జోనల్లో కాకుండా సరికొత్త కాన్సెప్ట్ తో ముందుకొచ్చి అందరినీ ఇంప్రేస్ చేయడంలో అతను విక్టరీ సాధించాడు. తెలుగులో బ్లాక్ బస్టర్ మూవీ మిగిలిన భాషల్లో కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీ తర్వాత నెక్స్ట్ సాయి ధరమ్ తేజ చేయబోయే చిత్రంపై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది.
అయితే తను చేయబోయే నెక్స్ట్ మూవీ గురించి ఈ మధ్య జరిగిన ఫ్యాన్స్ టిట్ చాట్ లో తేజ కాస్త హింట్ వదిలాడు. అతను చేయబోయే నెక్స్ట్ మూవీ మంచి మాస్ ఎలిమెంట్ తో వస్తున్నట్లు సాయిధరమ్ తేజ పేర్కొన్నారు. సాయి ధరమ్ తేజ (Sai Dharam Tej) మరియు సంపత్ నంది (Sampath Nandi) కాంబోలో రాబోయే ఈ చిత్రం మాస్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.
సీటీ మార్ మూవీ తర్వాత సంపత్ నంది ఓ మంచి మాస్కతా చిత్రాన్ని రెడీ చేయడం కోసం రెండేళ్లు గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతను తేజాతో సూపర్ యాక్షన్ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమాలో తేజ పక్కన హీరోయిన్ ఎవరు అన్న విషయం ఇంకా తెలియలేదు. మరోపక్క ప్రస్తుతం యూత్ ఫుల్ క్రేస్ తో దూసుకుపోతున్న శ్రీ లీలా (Sreeleela) ఈ చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. శ్రీ లీలా (Sreeleela) హీరోయిన్ కావాలి అనుకుంటే మాత్రం కచ్చితంగా ఇంకో సంవత్సరం సినిమా కోసం వెయిట్ చేయాల్సింది. మరోపక్క విరూపాక్షా లో తేజ తో నటించి మంచి హిట్ పైర్ అన్న టాక్ తెచ్చుకున్న సంయుక్తను (samyuktha menon) తిరిగి ఈ చిత్రంలో హీరోయిన్గా పరిగణించే అవకాశం ఉంది అన్న మాట వినిపిస్తోంది. ఇద్దరూ కానీ పక్షంలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని హీరోయిన్గా తీసుకునే అవకాశం ఉంది.
అయితే సాయి ధరమ్ తేజ పర్సనల్ ఛాయిస్ మాత్రం సమంతా (Samantha) ఆట. సమంత అంటే ఎంతో ఇష్టమైన సాయి ధరమ్ తేజ ఎప్పటినుంచో సమంతా తో ఒక్క సినిమా అయినా చేస్తే చాలు అనుకుంటున్నాడు. మరి డైవర్స్ తరువాత వరుస మూవీస్ తో బిజీగా ఉన్న సమంత (Samantha) ఈ మూవీకి ఓకే చెప్తే.. ఈ మూవీలో సమంత నటించిన అవకాశం ఉంది. సో మూవీ స్క్రిప్ట్ కంటే కూడా ప్రస్తుతం సాయి ధరమ్ తేజ (Sai Dharam Tej) నెక్స్ట్ మూవీ హీరోయిన్ల లిస్ట్ పెద్దదిగా ఉంది అని చెప్పవచ్చు. మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ తో పాటు మిగిలిన అన్ని డీటెయిల్స్ తో సహా హీరోయిన్ల పేర్లు కూడా త్వరలో అనౌన్స్ చేయడం జరుగుతుంది.
Web Title: Sai Dharam Tej and Samantha movie on cards, Sreeleela and Sai Dharam Tej Next movie, Sai Dharam Tej new movies details, Director Sampath Nandi