Sai Dharam Tej BRO Movie: సాయి ధరమ్ తేజ్ అలాగే పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్న సినిమా బ్రో. తమిళ నటుడు అలాగా దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటిస్తున్నాడని ఒక హైట్ తప్పించి ఇంతవరకు సినిమా నుండి విడుదలైన సాంగ్స్ గాని టీజర్ గాని అంతగా ఆకట్టుకోలేకపోయాయి. రీసెంట్గా ఈ సినిమా నుండి ఇంకో సాంగ్ కూడా విడుదల చేయడం జరిగింది.
Sai Dharam Tej BRO Movie: జాణవులే అనే సాంగ్ సినిమాకి హైలైట్ గా ఉంటుందని దర్శకుడు సముద్రం కానీ చెప్పటం కూడా జరిగింది. కానీ సాంగ్ విడుదలైన తర్వాత మ్యూజిక్ పరంగా కూడా ట్రోల్స్ ని ఎదుర్కొంటున్నారు. ఈనెల 28న విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్ లో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. బ్రో సినిమా ట్రైలర్ ని ఈ నెల 22న విడుదల చేస్తున్నట్టు.. దానితోపాటు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈ నెల 25న శిల్పకళా వేదికలో నిర్వహిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించడం జరిగింది.
బ్రో సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన ట్రోల్స్ మీద స్పందించడం కూడా జరిగింది. తాను దీని గురించి వివరణ ఇస్తూ, తన ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే గ్రేస్ తో డాన్స్ చేయలేకపోయానని.. సాంగ్స్ పక్కన పెడితే సినిమాలో చాలా అంశాలు అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటాయని చెప్పడం జరిగింది. దీనితోపాటు ఫ్యాన్స్ కి బాంబు లాంటి వార్త ఒకటి చెప్పడం జరిగింది.
మూడేళ్ల క్రితం సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది కొద్దిగా గాయం నుండి కోల్కొని సినిమాలు షూటింగు ప్రారంభించడం జరిగింది. కానీ తనకు ఆ గాయం ఇంకా మానలేదంటూ అలాగే దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నట్టు ఇంటర్వ్యూలో సాయి ప్రస్తావించడం జరిగింది. అలాగే ఆక్సిడెంట్ కారణంగా డ్యాన్స్ నుంచి మాట్లాడ్డం వరకు తడబడుతున్నాను అని కూడా చెప్పారు.
బ్రో సినిమాలోని డాన్స్ అలాగే డబ్బింగ్ పూర్తి చేసిన తర్వాత తాను చూసి చాలా ఇబ్బంది పడినట్టు కూడా చెప్పారు. దీనికి అసలు కారణం ఏమిటి అనేది కూడా సాయి ఈ ఇంటర్వ్యూలో వివరించడం జరిగింది. తనకు యాక్సిడెంట్ జరిగినప్పుడు స్టెరాయిడ్స్ ఇవ్వటం వల్ల చాలా బరువు తగ్గి అలాగే ఫిట్నెస్ కూడా కోల్పోయినట్టు.. ఆ తర్వాత స్టెరాయిడ్స్ ఆపేయటం వల్ల మళ్ళీ చాలా బరువు పెరగటం జరిగిందంట.

అందుకనే ఇప్పుడు బ్రో సినిమా విడుదలైన తర్వాత బరువు తగ్గి ఫిట్ నెస్ పై దృష్టిపెట్టాలని.. దాని తర్వాత చిన్న సర్జరీ చేయించాలని.. దాని నుండి కోలుకోవటానికి ఒక ఆరు నెలలు టైం పడుతుందని.. ఆ తరువాత సంపత్ నంది సినిమా షూటింగ్ మొదలు పెడతాను.. సాయిధరమ్ తేజ్ చెప్పుకు రావటం జరిగింది. ఇది తెలుసుకున్న మెగా ఫాన్స్ ఒకవైపు బాధపడుతూనే మరోవైపు త్వరగా కోలుకొని మళ్ళీ సినిమాలు చేయాలి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సాయి ధరంతేజ్ ఇప్పుడు రాబోతున్న బ్రో సినిమాతో కూడా మరో హిట్ అందుకోవాలని మెగా ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే అందుతున్న సమాచారం మేరకు బ్రో సినిమాని త్రివిక్రమ్ చాలా మార్పులు చేసినట్టు చెబుతున్నారు. ఈ సినిమా కూడా సాయిధరమ్ తేజ్ కి పక్కాగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కుతుందని ఫిలింనగర్ లో టాక్ అయితే నడుస్తుంది.