Sai Dharam tej to flaunt 6 pack look for Prathi Roju Pandage movie
Sai Dharam tej to flaunt 6 pack look for Prathi Roju Pandage movie

మెగా మేన‌ళ్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస హిట్లు కొట్టాడు. వరుస హిట్లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న సాయి ధరంతేజ్ ఆ తర్వాత వ‌రుస ప్లాపుల‌ బాట పట్టాడు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఆరు ప్లాపులతో కెరీర్ ప‌రంగా పూర్తిగా డౌన్లో పడిపోయాడు. అసలు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా నిలదొక్కుకున్నాడు. అన్న సందేహాలు కలుగుతున్న క్రమంలో చిత్రలహరి సినిమా ఓ మోస్తరు హిట్ కొట్టి కెరీర్ పరంగా మళ్లీ ఎట్టకేలకు ట్రాక్ ఎక్కాడు.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్‌ నిర్మాత‌గా తెర‌కెక్కుతున్న‌ ప్ర‌తిరోజు పండ‌గే.. ఈ సినిమాలో సాయి తేజ సిక్స్ ప్యాక్ లో కనిపించపోతున్నాడు.. సాయి తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తోన్న `ప్రతీ రోజు పండ‌గే` ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో రెండు యాక్షన్ ఎపిసోడ్స్ లో సాయి తేజ్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నాడు. సాయి తేజ్ హోమం చేస్తుండగా వచ్చే యాక్షన్ సీన్, ఆ సీన్‌లో హీరో షర్ట్ లేకుండా ఫైట్ సీక్వెన్స్ లో సిక్స్ ప్యాక్ లొ తేజ్ కనిపిస్తాడు.

ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్ అండ్ లిరికల్ సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల కానుంది. తమన్ సంగీతం అందించిన ఈ మూవీలో సాయి తేజ్ కు జోడిగా రాశిఖన్నా నటించింది.