అల్లరి నరేష్ ‘నాంది’ మూవీ టీజర్

0
578
Allari Naresh’s ‘Breathe of Naandi’ unveiled

Naresh naandhi teaser: టాలీవుడ్‌లో కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అల్లరి నరేష్. తన పంథా మార్చుకొని నటిస్తున్న ప్రయోగాత్మక చిత్రం ”నాంది’’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్.వీ 2 ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై సతీష్ వేగేశ్న నిర్మించాడు. వరుస కామెడీ సినిమాలు చేసినా నరేష్ పెద్దగా విజయాలు అందుకోలేకపోయారు. కిందటేడాది ‘మహర్షి’ సినిమాలో ఒక మంచి పాత్ర పోషించిన నరేష్.. ఇప్పుడు మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా ‘బ్రీత్ ఆఫ్ నాంది’ విడుదల చేయబడింది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఓ సన్నివేశంలో అల్లరి నరేష్ నగ్నంగా నటించడం సంచలనమైంది. ఏ తప్పు చేయకుండా ఓ కేసులో ఇరుక్కున్న ఖైదీగా నరేష్ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ‘బ్రీత్ ఆఫ్ నాంది’ పేరిట వచ్చిన ఈ టీజర్‌ను సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ విడుదల చేశారు. నా ప్రాణం పోయినా పర్వాలేదు.. న్యాయం గెలవాలి.. న్యాయమే గెలవాలి” అంటూ అల్లరి నరేష్ చెప్పే ఎమోషనల్ డైలాగ్ ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇందులో అల్లరి నరేష్ కాళ్ళు చేతులు కట్టివేయబడి నగ్నంగా ఓ ఐరన్ పోల్ పై పడుకొని కనిపిస్తున్నాడు.

టీజరే ఇలా ఉందంటే ఇక సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాగా, ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, ప్రియదర్శి, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, నవమి, శ్రీకాంత్ అయ్యంగార్, వినయ్ వర్మ, దేవి ప్రసాద్, ప్రమోధిని, మణిచందన ముఖ్య పాత్రలు పోషించారు.చోటా కె. ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేయగా.. రచయిత అబ్బూరి రవి సంభాషణలు అందించారు. ఇటీవలే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

Previous articleAllari Naresh’s ‘Breathe of Naandi’ unveiled
Next articlePawan Kalyan’s Vakeel Saab teaser to release on Diwali?