సాయి తేజ్ బయటపెట్టిన రంగమ్మత్త సరికొత్త అవతారం..!

0
352
Sai Dharam Tej Launches First Look Poster Of Anasuya Bharadwaj, Ashwin Viraj Thank You Brother

అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, అశ్విన్ విరాజ్‌ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘థ్యాంక్ యు బ్ర‌ద‌ర్’ నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మేష్ రాప‌ర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రానా ద‌గ్గుబాటి ఆవిష్కరించారు. దీనికి మంచి స్పంద‌న వచ్చింది. జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మాగుంట శ‌ర‌త్‌చంద్రా రెడ్డి, తార‌క్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పుడు నటీనటులను పరిచయం చేసే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆవిష్కరించారు. ప్రియ, అభిలను పరిచయం చేశారు.

ఈ పోస్టర్‌లో ఒక లిఫ్ట్‌లో అన‌సూయ భ‌ర‌ద్వాజ్ గర్భం ధరించినట్లు. కనిపిస్తూ… చేతిలో ఫేస్ మాస్క్ తో కోపంగా ఉండగా.. అశ్విన్ విరాజ్ సీరియ‌స్ గా కనిపిస్తూ వెనుక వైపు తిరిగి కనిపిస్తున్నాడు. దీనిని బట్టి చూస్తుంటే ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్లే ఉంది. అంతేకాడు లిఫ్ట్ కు, సినిమాలోని కధకు ఎదో లింక్ ఉండనే ఉందని అర్థమౌతోంది. ఇప్పుడు ఆ లిఫ్ట్‌లో అన‌సూయ‌, విరాజ్ ఎడ‌ముఖం పెడ‌ముఖం పెట్టుకొని నిల్చొని క‌నిపించ‌డంతో సినిమా కంటెంట్‌పై మ‌రింత ఆస‌క్తి పెరిగింది.

సురేష్ ర‌గుతు సినిమాటోగ్రఫీ అందించగా.. గుణ బాల‌సుబ్రమ‌ణియ‌న్ బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. షూటింగ్ పూర్తయిన ‘థ్యాంక్ యు బ‌ద్రర్’ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు జ‌రుగుతున్నాయి.ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో వైవా హ‌ర్ష‌, అనీష్ కురువిల్లా, కాదంబ‌రి కిర‌ణ్‌, అర్చనా అనంత్‌, మౌనికా రెడ్డి, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌, అన్నపూర్ణ‌, స‌మీర్‌ బాబీ రాఘ‌వేంద్ర‌ తదితరులు తారాగణం.

First Look Poster Of Anasuya Bharadwaj, Ashwin Viraj Thank You Brother

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here