Homeసినిమా వార్తలుబ్రో నుంచి మార్కండేయులుగా సాయి ధరమ్ ఫస్ట్ లుక్..!!

బ్రో నుంచి మార్కండేయులుగా సాయి ధరమ్ ఫస్ట్ లుక్..!!

Sai Dharam Tej look revealed from Bro movie details, Bro Movie Shooting update, Bro Movie latest news, Sai Dharam Tej motion poster Bro Movie, Pawan Kalyan, Bro Movie shooting location, Sai Tej first look poster from Bro Movie released

Sai Dharam Tej first look from Bro Movie: తాజాగా ‘బ్రో చిత్రం నుంచి సాయి ధరమ్ తేజ్ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర బృందం. .పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’ (BRO Movie). ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.

Sai Dharam Tej first look from Bro Movie: అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. ‘బ్రో’ చిత్రంలో మార్క్ అలియాస్ మార్కండేయులు అనే పాత్రలో కనువిందు చేయనున్నారు సాయి ధరమ్ తేజ్. ఈరోజు(మే 23) సాయంత్రం 4:14 గంటలకు మార్క్ పాత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.

తెల్ల దుస్తులు ధరించి ఫస్ట్ లుక్ లో ఎంతో అందంగా కనిపిస్తున్నారు సాయి తేజ్. మోషన్ పోస్టర్ లో గడియారాన్ని చూపిస్తూ మార్కండేయులుగా సాయి తేజ్ పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటోంది. బ్యాక్ గ్రౌండ్ లో “బ్రోదిన జన్మలేషం.. బ్రోవగ ధర్మశేషం.. బ్రోచిన కర్మహాసం.. బ్రోదర చిద్విలాసం” అనే శ్లోకం వినిపిస్తుండగా శాంతికి చిహ్నంలా తెల్ల దుస్తుల్లో సాయి తేజ పాత్రను పరిచయం చేయడం మెప్పిస్తోంది.

Sai Dharam Tej first look revealed from Bro movie

మే 18న ‘బ్రో’ టైటిల్ ని ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేయగా అద్భుతమైన స్పందన లభించింది. . విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ మోషన్ పోస్టర్ అత్యధిక వీక్షణలతో సోషల్ మీడియాలో సంచలన రికార్డులు సృష్టించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు సినీ పరిశ్రమలో బ్లాక్ బస్టర్ నిర్మాణ సంస్థగా దూసుకుపోతోంది.

ఈ సినిమా చాలాకాలం పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవడమే కాకుండా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్థాయిని మరింత పెంచే చిత్రమవుతుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. ‘బ్రో’ సినిమా 2023, జులై 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. చిత్ర నిర్మాణ కార్యక్రమాలన్నీ త్వరగా పూర్తి చేసి.. ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచే అద్భుతమైన చిత్రాన్ని అందించాలని చిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా ఏ.ఎస్. ప్రకాష్, సినిమాటోగ్రాఫర్ గా సుజిత్ వాసుదేవ్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

Web Title: Sai Dharam Tej look revealed from Bro movie details, Bro Movie Shooting update, Bro Movie latest news, Sai Dharam Tej motion poster Bro Movie, Pawan Kalyan, Bro Movie shooting location, Sai Tej first look poster from Bro Movie released

For the latest Telugu movie news, entertainment exclusives, gossip, movie reviews, and more, follow the Chitrambhalare website and YouTube channel, or head to our social media platforms like Twitter, Facebook, Instagram!

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY