సాయితేజ్ ‘రిపబ్లిక్‌’ రిలీజ్ డేట్ ఖరారు

0
354
Sai Dharam Tej Next film Republic confirmed release date

వైవిధ్యమైన చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చే యువ హీరోల్లో సుప్రీమ్ హీరో సాయితేజ్ ముందు వరుసలో ఉంటారు. అందువ‌ల్లే ‘చిత్రల‌హ‌రి’, ‘ప్ర‌తిరోజూ పండ‌గే’. ‘సోలో బ్రతుకే సో బెటర్’ వంటి వ‌రుస విజయాల‌ను సాయితేజ్ సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు చేసిన చిత్రాలకు భిన్నంగా సాయితేజ్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘రిప‌బ్లిక్‌’. ‘ప్రస్థానం’ వంటి డిఫరెంట్ పొలిటిక‌ల్ మూవీని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు దేవ్‌ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో ‘రిప‌బ్లిక్‌’ సినిమా శ‌ర‌వేగంగా తెర‌కెక్కుతోంది.

రీసెంట్‌గా విడుద‌ల చేసిన ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌, అందులోని కాన్సెప్ట్‌కి ప్రేక్ష‌కుల నుంచి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ ప‌తాకాల‌పై ఈ చిత్రాన్నినిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్‌వైడ్‌గా జూన్ 4న విడుదల చేస్తున్నారు.

Also Read: న‌ట‌సింహ‌ బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను BB3 విడుదల డేట్ ఫిక్స్

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ – ‘‘సాయితేజ్ హీరోగా దేవ్ క‌ట్టా‌గారి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘రిప‌బ్లిక్‌’ సినిమా ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. రీసెంట్‌గా విడుద‌లైన మోష‌న్ పోస్ట‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జూన్ 4న వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు.