సాయితేజ్‌ హీరోగా, సుకుమార్‌ రైటింగ్స్‌ నూతన చిత్రం ప్రారంభం

370
Sai Dharam Tej Next SDT15 launch with pooja ceremony today

సాయి ధరమ్ తేజ్ వరుస సినిమాలతో బిజీ గ వున్నాడు, ప్రస్తుతం సుబ్బ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’ . నభా నటేశ్ హీరోయిన్. ఈ చిత్రం మ‌రో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియో అసోసియేష‌న్‌తో డిసెంబ‌ర్‌ 25న విడుద‌లవుతుంది. సాయితేజ్‌ హీరోగా ఓ క్రేజీ కాంబినేషన్‌లో మరో క్రేజీ చిత్రం ప్రారంభమైంది.

తెలుగు సినీ పరిశ్రమలో భారీ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, వైవిధ్యమైన సినిమాలను అందిస్తూ, క్రియేటివ్‌ థాట్స్‌ను ప్రోత్సహించడంలో ముందుండే సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థల పతాకంపై భారీ చిత్రాల అగ్రనిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ దర్శకత్వ శాఖలో పనిచేసిన కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్‌ దర్శకుడు సుకుమార్‌ స్క్రీన్‌ప్లే అందిస్తుండటం విశేషం. కాగా ఈ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి చిత్ర కథానాయకుడు సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌ క్లాప్‌ నిచ్చారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కుమార్తె సుకృతివేణి, కుమారుడు సుక్రాంత్‌ కెమెరా స్వీచ్చాన్‌ చేశారు. నిర్మాత బీవీఎస్‌ ఎన్‌ ప్రసాద్‌ దర్శకుడు కార్తీక్‌ దండుకు స్క్రిప్ట్‌ను అందజేశారు. మిస్టికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు. ఈ చిత్రానికి నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ అండ్‌ సుకుమార్‌ రైటింగ్స్‌, పీఆర్‌వో: వంశీ కాక, మడూరి మధు, స్క్రీన్‌ప్లే: సుకుమార్‌, కథ-దర్శకత్వం: కార్తీక్‌ దండు..