సెన్సార్ పూర్తి చేసుకున్న రిపబ్లిక్..!

0
207

Republic Release date: సాయితేజ్‌, దేవ్ క‌ట్టా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ `రిప‌బ్లిక్‌`. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ‘యు/ఎ’ స‌ర్టిఫికేట్‌ను పొందింది. సినిమాకు సంబంధించి అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి కావ‌డంతో గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.

పోస్ట‌ర్ ద్వారా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే టోపి పెట్టున్న సాయితేజ్ ఇన్‌టెన్స్ లుక్‌తో క‌నిపిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి ఓ స‌రికొత్త ఇన్‌టెన్స్ పాత్ర‌లో సాయితేజ్‌ను చూడ‌బోతున్నార‌ని, నేటి స‌మాజంలో ఉన్న ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతూ అంద‌రిలో ఆలోచ‌న రేకెత్తించేలా సినిమా ఉంటుంద‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

ఐశ్వ‌ర్యా రాజేశ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విలక్ష‌ణ న‌టులు జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, కాలేజ్ సాంగ్‌తో పాటు జోర్ సే.. సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

Also Read: క్రిష్‌, వైష్ణవ్‌ చిత్రం విడుదల తేదీ ఖరారు..!

Sai Dharam Tej Republic censored and release on on October 1

జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్నినిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు.

Also Read: మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేసిన ‘రిప‌బ్లిక్‌’ ట్రైల‌ర్‌

 

 

Previous articleAdigaa Adigaa Lyrical Video – Akhanda
Next articleచిక్కుల్లో సోనూసూద్.. రూ.20 కోట్ల పన్ను ఎగవేత..?