sai dharam tej solo brathuke so better movie gets clean u censor certificate

Solo Brathuke So Better Censor: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ జంటగా రూపొందిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఈ చిత్రం ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బాపినీడు.బి సమర్పణలో శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మూడు లిరికల్ సాంగ్స్ కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందన దక్కించుకొని సినిమాపై భారీ క్రేజ్ ని ఏర్పరచడం జరిగింది. మంచి లవ్ స్ట్రో గా పలు కమర్షియల్ హంగులతో దర్శకుడు సుబ్బు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమా బుధవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ బోర్డు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని సాయి తేజ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘‘అతి త్వరలో మీ ముందుకు..’’ అని పేర్కొన్నారు. ఇకపోతే ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసి యూనిట్ ని అభినందించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచి ఎంటర్టైనింగ్ గా సాగిన ఈ సినిమా ఇంటర్వెల్ లో వచ్చే ఆకట్టుకునే ట్విస్ట్ తర్వాత ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తుందని అంటున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. వెంకటర్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటర్.

sai dharam tej solo brathuke so better gets clean u censor certificate