sai dharam tej solo brathuke so better_ hey idi nenena full song release date fix

Solo Brathuke So Better: Sai Dharam Tej: వరుస సినిమాలతో దూసుకుపోతున్న మెగా మేనల్లుడి గుండె పగిలిందట. అంతా ఓకే అని ఆనందపడే లోపలే ఓ అమ్మాయి హ్యాండిచ్చిందట. చివరకు ప్రియురాలితో బ్రేకప్ అయ్యింది. ఇప్పుడంతా సోలో బతుకే అయ్యింది. ఈ బ్రేకప్ స్టోరీని, దాంతో తాను పడిన బాధను పాట రూపంలో తెలియజేసేందుకు రెడీ అయ్యాడు సాయి ధరమ్ తేజ్. ఈ మేరకు అక్టోబర్ 15వ తేదీ ఉదయం 10 గంటలకు అన్నీ క్లియర్‌గా చెప్పేస్తా అని క్లారిటీ ఇచ్చేశాడు.

లవ్ లో పడిన ప్రతీ ఒక్కడికీ అది ఎప్పుడో ఒకప్పుడు కామన్గా ఎదరయ్యే సమస్యే. దీనిపై ఇప్పటి వరకు ఎన్నో గీతాలొచ్చాయి. ఆ సినిమాలోని తన ప్రేమ సంగతులు, బ్రేకప్ స్టోరీనే పాట రూపంలో ఆయన ప్రెజెంట్ చేయబోతున్నాడు సాయి. నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ రూపొందుతోంది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. నభా నటేష్ హీరోయిన్గా నటిస్తోంది. సింగిల్ ఫర్ ఎవర్ అనే కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసిన చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ”నో పెళ్లి” రిలీజ్ చేసి ఆకర్షించిన మేకర్స్ ఇప్పుడు రెండో పాట ”హే.. ఇది నేనేనా” విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన బ్రేకప్ సాంగ్ అంథెమ్ని ఈ 15న చిత్ర బృందం రిలీజ్ చేస్తోంది. అయితే బ్రేకప్ సాంగ్ లకు కాస్త భిన్నంగా ఈ పాట వుండబోతోందిట.