Solo Brathuke So Better Release date: చిత్రలహరి , ప్రతి రోజు పండగే చిత్రాలతో మెగా హిట్స్ అందుకున్న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఎట్టకేలకు థియేటర్స్ లోనే విడుదల కానుందని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. సంక్రాంతి కంటే ముందే అంటే డిసెంబర్లోనే.. మీకు నాకు ఇష్టమైన థియేటర్లో కలుద్దాం. దీపావళి శుభాకాంక్షలు అని తెలుపుతూ.. చిత్ర పోస్టర్ని సాయితేజ్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP బ్యానర్‌పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుబ్బు డైరెక్ట్ చేస్తున్నాడు. సుబ్బు చిత్రానికి ఇది మొదటిది కావడం విశేషం.
ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసిన చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూతబడటంతో ఈ సినిమా రిలీజ్ కాస్త ఆలస్యమైంది. ఈ మూవీ రీసెంట్ గా సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసారు. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్రానికి యూ సర్టిఫికెట్ జారీ చేసారు.ఓ వ్యక్తి బ్యాచిలర్ లైఫ్ లోనే అసలు కిక్ ఉందని చెప్పే ప్రయత్నం చేస్తూ.. చివరకు అతనే ఎలా ప్రేమలో మునిగాడో తెలిపే సినిమానే ఈ ‘సోలో బ్రతుకే సో బెటర్’.