Sai Dharam Tej Solo Brathuke So Better Shooting Completed

Sai Dharam Tej Solo Brathuke So Better Shooting Completed: సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమా చేస్తున్నాడు. త్త దర్శకుడు సుబ్బు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్‌ ఇందులో సాయికి జోడీగా నటిస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ కావడంతో గుమ్మడికాయ కొట్టేసారు.

‘ప్రతిరోజు పండగే’ తేజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. చివరిరోజు యూనిట్ సభ్యులంతా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ వీడ్కోలు పలికారు. యూనిట్‌ సభ్యులందరూ తమ జర్నీని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.హీరో సాయి ధరమ్‌తేజ్ కూడా ఈ సినిమా షూటింగ్‌లో తనకు ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ ట్వీట్ పెట్టాడు.

అసలు పెళ్లే వద్దు.. లైఫ్ అంతా సోలోగా ఉండాల్సిందే అనుకున్న కుర్రాడి జీవితంలోకి ఓ అమ్మాయి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా మారిపోయాయి అనేది అసలు కథ. ‘సరదా సరదాగా సాగిన మా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా షూటింగ్ పూర్తయింది. సెట్ మీద ఒక్క రోజు కూడా డల్ మూమెంట్ లేదు. మాస్క్ వేసుకుని షూటింగ్ చేసిన సందర్భాలైనా సరే.. మాస్క్ ధరించకుండా చేసిన సందర్భాలైనా సరే.. అంతా సరదాగా గడిచిపోయిదంటూ’ సాయి ధరమ్ తేజ్ యూనిట్‌తో దిగిన ఫోటోను షేర్ చేశాడు.

Sai Dharam Tej Solo Brathuke so better Shooting Completes and pumpking broken