సింగిల్స్‌కు సాయి తేజ్ భరోసా!

Sai dharam tej next movie Solo Brathuke So better theme video
Sai dharam tej next movie Solo Brathuke So better theme video

(Sai dharam tej next movie Solo Brathuke So better theme video, Sai Tej upcoming movie latest news)సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం హిట్ ట్రాక్‌లోకి పూర్తిగా వచ్చే పనిలో ఉన్నారు. ‘చిత్రలహరి’తో డిజాస్టర్ ట్రాక్ నుంచి బయటపడిన తేజూ.. ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో హిట్ ట్రాక్ వైపు వచ్చారు. సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఈ సినిమా ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమాకి ఫుల్‌గా ప్రచారం కల్పించే పనిలో తేజూ ఉన్నారు. దీని కోసం వాలంటైన్ వీక్‌ను బాగానే వాడుకున్నారు. రేపు వాలంటైన్స్ డే (ఫిబ్రవరి 14) సందర్భంగా ఈరోజు ‘సోలో బ్రతుకే సో బెటర్’ థీమ్ వీడియోను విడుదల చేశారు తేజూ. ”సింగిల్ సోదరసోదరీమణులారా.. ఇతరులు వాలంటైన్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు మన ఫీలింగ్ ఇలా ఉంటుంది” అంటూ ఈ థీమ్ వీడియోను తేజూ ట్వీట్ చేశారు. ఒక నిమిషం 13 సెకెన్ల నిడివితో ఉన్న ఈ వీడియో ఆకట్టుకునేలా ఉంది. ఈ వీడియోలో సుప్రీం హీరో ప్రధాన ఆకర్షణ కాగా.. పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

సింగల్ సోదరసోదరీమణులారా…This is about our feeling when ever others celebrate Valentine’s Day #Solobrathukesobetter #SBSB Here’s the link guys…hope you like it https://youtu.be/KXVMfkyepFQ @SVCCofficial @MusicThaman @subbucinema @NabhaNatesh @bkrsatish

‘‘కోపం – ఇష్టం, విచారం – సంతోషం, ఆనందం – బాధ.. ఇవన్నీ కాలంతో పాటు కారణాలతో పాటు మారిపోయే ఫీలింగ్స్. అలాగే ప్రేమనేది కూడా ఒక ఫీలింగేగా.. మారదని గ్యారంటీ ఏంటి?’’ అంటూ తేజూ ఆవేశంగా చెప్పే డైలాగ్ ఈ థీమ్ వీడియోలో హైలైట్. మొత్తం మీద ఈ వాలంటైన్స్ డే నాడు సింగిల్స్ దృష్టిని ఆకర్షించేలా, వాళ్లను ఉత్తేజపరిచేలా తేజూ ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే స్లోగన్‌ను వినిపించారు.