ఆహా లోకి సాయి పల్లవి మలయాళ చిత్రం ‘అనుకోని అతిథి’

0
29
Sai Pallavi Anukoni Athidhi Streaming On Aha OTT

Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘అథిరన్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అనుకోని అతిధి’గా విడుదల చేయనున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు వివేక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కేరళలో 1970లలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా అక్కడ మంచి విజయం సాధించింది.

ఈ క్రమంలో ”అనుకోని అతిధి” చిత్రాన్ని ఆహా విడుదలకు సిద్ధం చేశారు. దర్శకుడు వివేక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కాగా తెలుగులో ఈ సినిమాను ఇంట్రోపీ ఫిలిమ్స్ బ్యానర్ పై అన్నపురెడ్డి కృష్ణ కుమార్, గోవింద రవి కుమార్ నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ కరంగా ఈ సినిమాని ఆహా లో విడుదల చేస్తున్నారు.. మే 28న ఈ సైకాలజికల్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

‘అనుకోని అతిధి’ చిత్రంలో ప్రకాష్ రాజ్ – అతుల్ కులకర్ణి – రెంజి పానికర్ – లియోనా లిషోయ్ – శాంతి కృష్ణ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఇకపోతే ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఒకటి రానా హీరోగా రూపొందుతున్న ‘విరాటపర్వం’ కాగా.. మరొకటి శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం.